ధర్మవరం, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి చిలకం మధుసూదన్ రెడ్డి సమక్షంలో ధర్మవరం పట్టణంలోని వివిధ వార్డులకు సంబంధించి 35 చేనేత కుటుంబాలు చేరడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ చేనేత కార్మికులకు కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ ఏ ఆపద వచ్చిన ముందు ఉంటానని చేనేత వ్యవస్థను పటిష్టం చేసేంతవరకు నిరంతరం అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చి అలాగే ప్రతి కార్యకర్త సైనికుడిలాగా పనిచేసి జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్మిద్దామని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, నత్తి శ్రీరామ్ రెడ్డి ( మాజి స్టోర్ డీలర్ ) పోతిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, బిల్లే లోకేష్, పామిశెట్టి నీల కృష్ణ, పల్లపు రమణ, పల్ల నరసింహ దాస్, ఏర్రాజోడు రామంజి, అంకే.మోహన్, పామిశెట్టి రవి, దాసరి ఉదయ్ కుమార్, బాదూల్ల, పెనుకొండ కట్టింటి మురళి, ఉమ్మడి మల్లికార్జున, పామిశెట్టి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.