Logo
Date of Publish : 06 March 2026, 1:45 pm
Editor : Sake Naresh

ఘనంగా గుత్తా జోష్ణ, వీరేష్ ల పెళ్లిసందడి ప్రముఖుల హాజరు – కిటకిటలాడిన కళ్యాణవేదిక

ముదిగుబ్బ, మార్చి 5, జనస్వరం : మండలం లోని సానేవారిపల్లి గ్రామ తెలుగుదేశం నాయకులు గుత్తా సూర్యనారాయణ, శ్యామలమ్మ దంపతుల కుమార్తె జోష్ణ వివాహం గురువారం ఘనంగా జరిగింది. ఉరవకొండ సమీపంలోని లత్తవరం గ్రామానికి చెందిన వరుడు వీరేష్ కు కళ్యాణవేదిక వద్ద అపూర్వస్వాగతం లభించింది. వధూవరులిద్దరూ బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఐదురోజులపాటు అంగరంగ వైభవంగా సాగిన పెళ్లివేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ముదిగుబ్బ వద్ద సంకేపల్లి క్రాస్ లోని ఆర్.ఎస్.ఏ. కళ్యాణమండపంలో బుధవారం రాత్రి పెళ్లి విందు వైభవంగా సాగింది. గురువారం ఉదయం 10:00 గంటలకు మాంగళ్యధారణకు భారీగా బంధుమిత్రులు తరలివచ్చారు. నూతన వధూవరులను వందలాదిమంది అక్షింతలు వేసి, ఆశీర్వదించారు. నిర్వహణ ఏర్పాట్లను తెలుగు యువత జిల్లా నాయకుడు గుత్తా కార్తీక్ నాయుడు, కాంట్రాక్టర్ జొన్నగడ్డల రంగయ్య, రామకృష్ణ, ప్రసాద్, తదితరులు స్వయంగా పర్యవేక్షించారు. ఈ వివాహ వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారి చల్లా రామాంజనేయులు, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.ఎన్. నరసయ్య, దక్షిణ మధ్య రైల్వే కమర్షియల్ విభాగం అధికారి గుత్తా సోమశేఖర్ నాయుడు, దక్షిణ నైరుతి రైల్వే అధికారి వేలూరు నారాయణప్ప, కేంద్ర ప్రభుత్వ పిఎఫ్ శాఖ అధికారి హంజే నాయక్, ముదిగుబ్బ ఎంపిపి ఆదినారాయణ యాదవ్, వివిధ మండలాల టిడిపి నాయకులు తుమ్మల రమణ, పత్తిరెడ్డి, గుత్తా కొండయ్య, కాకర్ల సురేంద్ర నాయుడు, గుత్తా కేశప్ప, లత్తవరం శ్రీనివాస్, బిజెపి నాయకులు సోమల ప్రకాష్ నాయుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ పూర్వ సభ్యులు, శ్రీశ్రీ కళావేదిక జాతీయ ఉపాధ్యక్షులు, సీనియర్ కవి గుత్తా హరిసర్వోత్తమ నాయుడు, తిరుపతి జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ సభ్యులు, ప్రజా కళావేదిక ఛైర్మన్, కవి అరవ జయపాల్, చినగాని నరసింహ యాదవ్, కె. కోటేశ్వర రెడ్డి, హైకోర్టు న్యాయవాది, బిసిఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు సాకే నరేష్, రాయలసీమ బిసి సంఘం అధ్యక్షులు కొట్టాల శ్రీరాములు, వైకుంఠం రమణ, కోడెకండ్ల శంకర్, సీనియర్ ఉపాధ్యాయులు అమ్మినేని శ్రీరాములు, గుత్తా శంకరనారాయణ, గుర్రం నాగభూషణ, కొండవీటి ప్రసాద్, అమళ్లదిన్నె నరేంద్ర, ఏ. భారతి బాలాజీ, హబీబుల్లా, అంగడి సగిలి నాగప్ప, రియల్టర్లు టివి రమణ, డివి రమణ, వెంకటేశ్వర్లు గౌడ్, ముదిగుబ్బ రమణ నాయుడు, గుత్తా పురుషోత్తమ నాయుడు, సోదరులు జి. దామోదర్ నాయుడు, జి. చంద్రమోహన్ నాయుడు, గుత్తా లిఖిత్ చౌదరి, జి. వంశీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంప్రదాయక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com