Search
Close this search box.
Search
Close this search box.

జాతీయ ఉగాది కవిసమ్మేళనానికి గుత్తా హరి ఎంపిక

        అనంతపురము, ఏప్రిల్‌ 02 (జనస్వరం) : క్రోధినామ ఉగాది సందర్భంగా ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం నిర్వహించే జాతీయ కవిసమ్మేళనానికి జిల్లాకు చెందిన సీనియర్ కవి గుత్తా హరిసర్వోత్తమ నాయుడు ఎంపికయ్యారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని దీన్ దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ భవన్ లో ఈ నెల 5 వ తేది కార్యక్రమానికి రావాలని డైరెక్టర్ ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ ఆహ్వానపత్రిక పంపారు. ప్రపంచ తెలుగు సాహిత్య, సాంస్కృతిక అకాడమీ జాతీయ అధ్యక్షులుగా ప్రముఖ కవి, రచయిత, సామాజిక కార్యకర్త గుత్తా హరిసర్వోత్తమ నాయుడు పనిచేస్తున్నారు. అకాడమీ అంతర్జాతీయ ఛైర్మన్, శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ ఛైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గత ఏడాది ఉత్తర్వులు జారీచేశారు. అకాడమీ విస్తృత సమావేశంలో సభ్యులందరూ ఏకగ్రీవంగా నిర్ణయించారని తెలిపారు. రెండేళ్ల పాటు 2023 – 2025 కాలానికి గుత్తా హరి జాతీయ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించాలని డా. కత్తిమండ ప్రతాప్ కోరారు. ఐ.ఎస్.ఓ. గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవాసంస్థ శ్రీశ్రీ కళావేదిక జాతీయ ఉపాధ్యక్షులుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా గుత్తా హరి విశేష సేవలందిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ శ్రీశ్రీ కళావేదిక సేవలో అంకితభావంతో నిరంతర కృషి కొనసాగిస్తున్న గుత్తా హరిసర్వోత్తమ నాయుడు అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన సంస్థతో ఆయనకు సుదీర్ఘ అనుబంధం వుంది. గతంలో సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా, ప్రపంచ కవితోత్సవం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా, అనంతపురం జిల్లా శాఖ అధ్యక్షుడిగా గుత్తా హరి విశేష సేవలందించారు. మైసూరులో తెలుగు – కన్నడ కవితా గోష్టి నిర్వహణలో తనదైన భాగస్వామ్యం వహించారు. అనంతపురం జిల్లా యువజన కమిటీ గౌరవాధ్యక్షుడుగా వుంటూ సాహిత్యంలో యువతరాన్ని ప్రోత్సహిస్తున్నారు. జిల్లా రచయితల సంఘం (జిరసం) అధ్యక్షుడుగా, ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షులుగా, జిల్లా కార్యదర్శిగా వివిధ బాధ్యతల్లో సుదీర్ఘకాలం కొనసాగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ (ఎపిజిపి) రాష్ట్ర సభ్యులుగా తనదైన శైలిలో సేవలందించారు. శ్రీశ్రీ కళావేదిక నిర్వహిస్తున్న కార్యక్రమాలు, ప్రపంచ రికార్డు సభల్లో తనవంతు భాగస్వామ్యం వహిస్తున్నారు. ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ సి.ఈ.ఓ.గా, వనిత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులుగా, అనంత సాహితీ ప్రస్థానం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షులుగా బహుముఖ సేవలందించారు. అధికార భాషా సంఘం జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సభ్యులుగా, ఉదయ్ విద్యాసంస్థల సిఈఓగా, ఏపి చిన్న – మధ్య తరహా పత్రికల సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ గా పనిచేశారు. సాహిత్య భారతి అధ్యక్షులుగా, మహాత్మా గాంధీ సేవా ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. గుత్తా హరి రాస్తున్న కవితలు, వ్యాసాలు పలు పత్రికలు, ప్రత్యేక సంచికల్లో ప్రచురితమవుతున్నాయి. ఆయన రచనలు, సేవలకు గుర్తింపుగా ఇప్పటికే పలు అవార్డులందుకున్నారు. 2012 జనవరిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ సామాజిక కార్యకర్త అవార్డును అప్పటి కలెక్టర్ వి. దుర్గాదాస్ చేతులమీదుగా అందుకున్నారు. శ్రీశ్రీ కళావేదిక సభల్లో పలు పురస్కారాలు, సత్కారాలు పొందారు. పలు సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవాసంస్థలు అనేకసార్లు ఘనంగా సత్కరించాయి.

*గుత్తా హరి ఎంపిక పట్ల హర్షం :*

ప్రపంచ తెలుగు సాహిత్య, సాంస్కృతిక అకాడమీ జాతీయ అధ్యక్షులు, శ్రీశ్రీ కళావేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ ఉపాధ్యక్షులు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు జాతీయ ఉగాది కవిసమ్మేళనానికి ఎంపికవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. పి. రమేష్ నారాయణ, ప్రముఖ విద్యావేత్తలు నల్లాని రాజేశ్వరి, గొర్తి వెంకటస్వామి, హైకోర్టు న్యాయవాది సాకే నరేష్, శ్రీశ్రీ కళావేదిక యూనివర్శిటీ విభాగం రాష్ట్ర కన్వీనర్ డా. బత్తల అశోక్ కుమార్, వేదిక అనంతపురం జిల్లా అధ్యక్షుడు గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి టివి రెడ్డి, కార్యదర్శులు డి. కుళ్లాయప్ప, ఎస్. రామాంజనేయులు, పేరూరు బాలకృష్ణ, అల్తాఫ్, పాల్వాయి రాధిక, తిరుపతి జిల్లా గౌరవాధ్యక్షుడు, ప్రముఖ సాహితీవేత్త డా. వి.ఆర్ రాసాని, జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధానకార్యదర్శి అరవ జయపాల్, జిల్లా ప్రధానకార్యదర్శి ధనాశి ఉషారాణి, ఉపాధ్యక్షులు రాళ్లపల్లి రజని తదితరులు అభినందనలు తెలిపారు.

• తిరుపతిలో ప్రపంచ రికార్డు సభల నిర్వహణతో కీలకమలుపు

         ఐ.ఎస్.ఓ. గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక, ఇంద్రాణి ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 9, 10 తేదీల్లో తిరుపతి మహతి కళాక్షేత్రంలో 48 గంటలపాటు ప్రపంచ రికార్డు కార్యక్రమం నిర్వహించడంలో గుత్తా హరి కీలకపాత్ర పోషించారు. కవులు, కళాకారుల ప్రోత్సాహం కొరకు ప్రపంచ కవితోత్సవం – సాహిత్య సదస్సులు – కళా ప్రదర్శనలు – పుస్తకావిష్కరణలు తదితర సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రపంచ సాహితీ, కళా చరిత్రలో ఈ బ్రహ్మోత్సవాలు వరల్డ్ రికార్డును కైవసం చేసుకున్నాయి. శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ ఛైర్మన్, ప్రపంచ తెలుగు సాహితీ సాంస్కృతిక అకాడమీ ఛైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ ఆధ్వర్యంలో, ఎంతో బృహత్తర సాహితీ, కళా పండగ నిర్వహణలో ప్రోగ్రామ్ కన్వీనర్ గా గుత్తా హరి వ్యవహరించారు. విజయవంతంగా కార్యక్రమ నిర్వహణతో ఆయన ప్రస్థానం కీలక మలుపు తిరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way