Logo
Date of Publish : 01 November 2025, 7:15 pm
Editor : Sake Naresh

శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర అధ్యక్షునిగా గుత్తా హరి

- ఏపీ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎంపిక :

- అంతర్జాతీయ ఛైర్మన్ కత్తిమండ ప్రతాప్ ఆమోదం

- జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరీభూషణం వెల్లడి

       అనంతపురము, అక్టోబర్ 31, జనస్వరం : అంతర్జాతీయ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవాసంస్థ "శ్రీశ్రీ కళావేదిక" ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. ప్రముఖ సాహితీవేత్త, అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ ఆదేశాల మేరకు ఈ కమిటీని నియమించినట్లు జాతీయ అధ్యక్షురాలు జి. ఈశ్వరీభూషణం వెల్లడించారు. అన్ని జిల్లాలకు తగిన ప్రాతినిథ్యం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వివరించారు. ఈ మేరకు జాతీయ కోర్ కమిటీ చర్చించి అనుభవం, సేవాభావం, సమర్థత, నిబద్ధత ప్రాతిపదికన రాష్ట్ర నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏపీ రాష్ట్ర అధ్యక్షునిగా ప్రముఖ కవి, సామాజిక కార్యకర్త, సీనియర్ జర్నలిస్ట్ గుత్తా హరి సర్వోత్తమ నాయుడుకు రెండోసారి అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. జాతీయ ఉపాధ్యక్షునిగా కూడా ఆయన సేవలు కొనసాగిస్తారని స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలో అనుబంధ విభాగాలను కూడా పటిష్టం చేసేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నూతనంగా ఎంపికైన పూర్తి కార్యవర్గాన్ని ఈశ్వరీభూషణం ప్రకటించారు. కొత్త కమిటీ సభ్యుల పూర్తి జాబితాను శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ లో శ్రీశ్రీ కళావేదిక నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఘనతతో ఏర్పాటు చేసినట్లు సగర్వంగా ప్రకటిస్తున్నామన్నారు. ఈ కార్యవర్గం ఏకగ్రీవంగా, సభ్యుల సంపూర్ణ అనుమతితో, సీనియర్, ప్రతిభావంతుల సహకారంతో ఏర్పడిందన్నారు. ఈ కొత్త రాష్ట్ర కమిటీలో సాహిత్య, సాంస్కృతిక, సామాజిక రంగాల ప్రఖ్యాత సీనియర్ నాయకులు చేరడం గొప్ప అదృష్టమన్నారు. వారు తమ ప్రతిభ, అనుభవం, సృజనాత్మక శక్తితో శ్రీశ్రీ కళావేదిక అభ్యుదయానికి, సాహిత్య విస్తరణకు మార్గదర్శకులుగా నిలుస్తారని పేర్కొన్నారు.

      జాతీయ ఉపాధ్యక్షులు గుత్తా హరి సర్వోత్తమ నాయుడు (అనంతపురము) ను రెండోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించారు. రాష్ట్ర గౌరవాధ్యక్షునిగా ప్రముఖ న్యాయవాది, సీనియర్ కవి నరహరి నారాయణ రెడ్డి (కర్నూలు), రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ప్రముఖ విద్యావేత్త, అనువాదకులు డా. పి. రమేష్ నారాయణ (అనంతపురము), రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా కవయిత్రి మలేకర్ నాగజ్యోతి (కర్నూలు) ని ఎంపిజేశారు. రాష్ట్ర గౌరవ సలహాదారుగా విద్యాసంస్థల అధినేత కామకోటి ప్రసాదరావు (మదనపల్లి), రాష్ట్ర క్రమశిక్షణా మండలి అధ్యక్షుడిగా ప్రముఖ విద్యావేత్త, రచయిత కొలచిన రామ జగన్నాథ్ (శ్రీకాకుళం), రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ గా ప్రముఖ న్యాయవాది, కవి మరువాడ భానోజీ (విశాఖపట్నం) నియమితులయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాయలసీమ ప్రాంతీయ అధ్యక్షుడిగా అరవ జయపాల్ (తిరుపతి), ఉత్తరాంధ్ర ప్రాంతీయ అధ్యక్షునిగా ప్రముఖ విద్యావేత్త, రచయిత డబ్బీరు గోవిందరావుకు అవకాశం దక్కింది.
రాష్ట్ర సమన్వయకర్తగా సి.హెచ్. రవికుమార్ (కృష్ణా), రాష్ట్ర అధికార ప్రతినిధిగా డా. కె.ఆర్.జి. శేషుకుమార్ (విజయవాడ) లకు చోటు కల్పించారు. రాష్ట్ర కార్యదర్శులుగా నల్లా నరసింహమూర్తి (కోనసీమ), బివివి సత్యనారాయణ (అమలాపురం), 'అమ్మకవి' కొండేపూడి తాతబ్బాయి (కాకినాడ), ఎస్.వి.వి.ఎస్. ప్రసాద్ (పశ్చిమ గోదావరి), యనమదల సూర్యనారాయణ రాజు (విశాఖపట్నం), సుజయ్ కృష్ణ (ఏలూరు), గొట్టుముక్కల నాసరయ్య (ప్రకాశం), వివిస్ ప్రసాద్ (తణుకు), నూనె రమేష్ (అల్లూరి జిల్లా), రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా బోగెల ఉమా మహేశ్వరరావు (శ్రీకాకుళం), జి.ఎల్.ఎన్. శాస్త్రి (అనకాపల్లి), నియమితులయ్యారు. రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా బైరపోగు బెన్నమ్మ (కర్నూలు), మహిళా కార్యదర్శులుగా శ్యామల శ్రీహరికోటి (ఏలూరు), సువర్ణ జోషి (కర్నూలు), కరణం విమల (చిత్తూరు), ఇళ్లిపిల్ల నాగపావని (విజయవాడ), ఏలూరు ధర్మవతి (భీమిలి) లను ఎంపికజేశారు. రాష్ట్ర సాంస్కృతిక విభాగం కార్యదర్శులుగా హరిత (పీలేరు), కోలకొండ వీర నాగేశ్వరయ్య (కర్నూలు) లను నియమించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com