Logo
Date of Publish : 21 July 2020, 9:46 am
Editor : Sake Naresh

ప్రైవేట్ టీచర్లకు చేసే సాయాన్ని గురుదక్షిణగా భావిస్తాం.

ప్రైవేట్ టీచర్లకు చేసే సాయాన్ని గురుదక్షిణగా భావిస్తాం.

ప్రైవేట్ టీచర్లకు చేసే సాయాన్ని గురుదక్షిణగా భావిద్దాం- జనసేన నేత తాడిశెట్టి నరేష్
• పామర్రులో ప్రైవేట్ టీచర్లకు జనసేన నిత్యావసరాలు
• ఒక్కోక్కరికీ రూ. 2,000 విలువ చేసే కిట్ల పంపిణీ
• ప్రైవేట్ టీచర్లను ప్రభుత్వం ఆదుకోవాలి
• జనసేన స్థానిక సంస్థల ఎన్నికల ఇంఛార్జ్ తాడిశెట్టి నరేష్ డిమాండ్.

కరోనా కారణంగా జీవనోపాధి కోల్పోయిన వర్గాల్లో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులు ముందు వరుసలో ఉంటారనీ, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని జనసేన పార్టీ పామర్రు నియోజకవర్గం స్థానిక సంస్థల ఎన్నికల ఇంఛార్జ్ తాడిశెట్టి నరేష్ అన్నారు. సమాజంలో మాస్టర్ గారు అన్న పిలుపుతో ఎంతో గౌరవంగా బతికిన వారు ఇవాళ ఎక్కడ పని దొరుకుతుందా అని ఎదురు చూసే దయనీయ స్థితికి వచ్చేశారని తెలిపారు. కొంత మంది ఆత్మగౌరవాన్ని చంపుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే., మరికొంత మంది కుటుంబ పోషణ నిమిత్తం వ్యవసాయ కూలీలుగా మారడం చూస్తే తన హృదయం కలచివేసిందన్నారు. కృష్ణా జిల్లా పామర్రు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలల్లో పని చేసే టీచర్లకు ఒక్కొక్కరికీ రూ. 2,000 విలువ చేసే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 25 కేజీల బియ్యం కట్టతో పాటు నెల రోజులకు సరిపడే నిత్యవసర సరుకులతో కూడిన కిట్లను గురువులకు అందించారు.
ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.. గత 5 నెలలుగా పాఠశాలలు మూతపడిన నేపధ్యంలో యాజమాన్యలు జీతాలు ఇవ్వడం మానేశాయడంతో వీరంతా జీవనోపాధి కోల్పోయారని అన్నారు. కుటుంబ పోషణ భారమై అప్పులు చేయలేక ఇప్పటికే పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారనీ, భావిభారత పౌరులను తయారు చేసే గురువులు ఇలాంటి దుర్భర పరిస్థితులు అనుభవించడం సమాజానికి మంచిది కాదన్నారు. ఏళ్ల తరబడి సేవలు చేయించుకున్న యాజమాన్యాలు వారికి కనీస అవసరాలు అయినా తీర్చే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కూడా ప్రైవేట్ టీచర్ల పట్ల సానుభూతితో వ్యవహరించి, ఆదుకోవాలని కోరారు. ముందు ముందు మరింత మందికి సాయం అందించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. పార్టీలకు అతీతంగా అందరూ స్పందించాలనీ, గురువులకు చేసే సాయాన్ని అంతా గురుదక్షిణగా భావించాలని నరేష్ పిలుపునిచ్చారు. కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తతో వ్యవహరించాలని నియోజకవర్గం ప్రజలకు సూచించారు.
ఇ కార్యక్రమాంలో నియోజకవర్గ జనసైనికులు పంచకర్ల సందీప్ శ్రీపతి శ్రీనివాస్, భీమాల అజయ్ కుమార్, కణిజం సురేష్ మరియు ప్రైవేటు టీచర్స్ లెక్చరర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com