Logo
Date of Publish : 05 January 2022, 5:17 pm
Editor : Sake Naresh

రోడ్డు ప్రమాదంలో మరణించిన జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన గురజాల జనసేన నాయకులు

   గురుజాల, (జనస్వరం) : ఇటీవల రోడ్డు ప్రమాదంలో గురజాల పట్టణానికి చెందిన అన్వర్ మరణించిడం జరిగింది. వారి కుటుంబ పరిస్థితిని తెలుసుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కటికం అంకారావు, జనసేన నాయకులు ప్రసాద్, అజీస్, కళ్యాణ్ చేతుల మీదగా అందజేశారు. ఈ సందర్భంగా అంకారావు మాట్లాడుతూ ఇంట్లో పెద్ద వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబం పడే బాధ మాటల్లో చెప్పలేమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో, మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు. పార్టీలకతీతంగా అందరూ వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సామాజిక సేవ చేయడం మా బాధ్యత అని, దానికి స్ఫూర్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మస్తాన్, చందు, నాగేంద్రబాబు, హరి, అశోక్ సుధాకర్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com