నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు జిల్లాకు ముందు శ్రీ పొట్టి శ్రీరాములు అని చేర్చి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం సాధించిన మహనీయులు, స్వాతంత్ర సమరయోధులు శ్రీ పొట్టి శ్రీరాములు గారికి గౌరవం ఇచ్చి జిల్లాని పేరు మార్చారు. కాబట్టి మనం ఆయన కిచ్చే పెద్ద నివాళి అవుతుందని గునుకుల కిషోర్ అన్నారు. శ్రీ రాములు గారి గౌరవాన్ని కీర్తి ప్రతిష్టలను భావితరాలకు బాధ్యతను పరిచయంచేస్తున్న ప్రత్యేక ఆంధ్ర సమరయోధులు పొట్టి శ్రీరాములు సన్నిహితులు కేవీ చలమయ్యని మర్యాదపూర్వకంగా నెల్లూరు సిటీ సంతపేట వారి నివాసంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ కలిశారు. ఎంతో వయసు ఉన్నా అంతకుమించి జ్ఞాపకశక్తి కలిగి ఉండి పలువురుని పలకరిస్తూ నెల్లూరు విశేషాలు కనుక్కుంటూ సరదాగా సాగే పెద్దాయనను కలిసి ఆశీర్వాదం తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. మహనీయుల త్యాగాలను స్ఫూర్తిని మీవంటి మానవతామూర్తుల ప్రేమతో ముందుకు తీసుకెళ్తామని చెప్పడం జరిగిందన్నారు. పోరాటం అంటే తెలియని రోజుల్లోనే మనకంటూ రాష్ట్రం కావాలంటూ పోరాడిన మహనీయులను వారి పోరాట పటిమను స్మరిస్తూ సామాజిక సమస్యలను ప్రశ్నిస్తూ... పోరాడే హక్కును బాధ్యతలను, పౌరులకు గుర్తు చేస్తూ ముందుకు సాగుతామని తెలపడం జరిగిందన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com