Search
Close this search box.
Search
Close this search box.

వైసీపీ నాయకుల్ని ఏకీపారేసిన గునుకుల కిషోర్

వైసీపీ

     నెల్లూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ గారు వారి కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ మండలంలో ఉండే 18 గ్రామాల్లో ఇప్పటికీ మీ పేరు చెబుతూ జరుగుతున్న పలు గ్రామాల్లో పొట్టే పాలెం,అమ్మంచర్ల, ములుమూడి, కందమూరు, గొల్ల కందుకూరు, సౌత్ మోపూరు అక్రమత్రవకాలు, అక్రమ ఇసుక రవాణా ఆనవాళ్ళతో సహా నేను చూపించగలను, వాళ్ల దగ్గర తీసుకుంటున్న కమిషన్ మీరు చెప్పగలరా? పెయిడ్ బ్యాచ్ అన్నారు… పెయిడ్ బ్యాచ్ అంటే ఆర్థిక లబ్ధి కోసం ఎవరో ఒకరు కింద ఉండి పనులలో ఆర్థిక లబ్ది పొందడం లేకపోతే వారి దయా దక్షిణాల మీద ఏమైనా ఇస్తే పనులు చేసుకుని సంపాదించుకోవడం.పంచాయతీలు సెటిల్మెంట్లు దందాలు భూ అక్రమణలు వంటివి మాకు లేవు ఈ విషయం మీ పెద్దవాళ్ళను కావాలంటే అడిగి తెలుసుకోవచ్చు.. రోజుకు ఒక పార్టీ మార్చే ప్యాచ్ వర్క్ కూడ వెయ్యలేని ప్రభాకర్ రెడ్డి గారు మీకు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే అర్హత మీకేముంది.. 18 గ్రామాల పేర్లు తెలియదన్నారు 18 గ్రామాల్లో ఎక్కడెక్కడ రోడ్డు డ్యామేజ్ అయి ఉన్నాయో చూపగలను.. గత ఎన్నికల్లో 18 గ్రామాల్లో జనసేన తరఫున పోటీ చేసిన మా జిల్లా అధ్యక్షుడు మను క్రాంత్ గారి తో నేను తిరిగాను. శిలాఫలకం వేసి 45 రోజులు ఉంది ఇంకో నాలుగు నెలలు ఎన్నికలు సమీపిస్తున్నాయి…మీరు ఎప్పటి లోగా పూర్తి చేస్తారని నీకు ప్రశ్నిస్తే చాలా లెక్కలు చెప్పారు. గతంలో మీరు ఏ గ్రామంలో ఉన్నారు ఏ కారణాల రీత్యా ఆ గ్రామం నుంచి దూరంగా ఇప్పుడు నెల్లూరులో ఉంటున్నారు అవన్నీ మీ వ్యక్తిగతము కాబట్టి మేము ప్రస్తావించము. కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగిందంటున్నారు. స్థానిక గ్రామంలో మీ ఇంటి పక్క వీధి, నీ ఇంటికి మెయిన్ రహదారి మట్టిరోడ్డుగానే ఎందుకు మిగిలింది, రోడ్డు లేకుండా పది సంవత్సరాల నుంచి ఎందుకు అడ్డుకుంటున్నారు. వ్యక్తుల గురించి మర్శించేందుకు మీ ముందుకు రాలేదు… ప్రభుత్వం గురించి ప్రశ్నిస్తున్నాను గత ఐదు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఉన్నట్టుండి ఈ అయిదారు నెలల నుంచి హడావుడి చేయడం ఎందుకు అని నిలదీశాము. రూరల్ ఇంచార్జిగా బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి ఎంపీ నిధులు కొన్ని ప్రత్యేక నిధులు చెప్పించి ఆయన అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు సరే కానీ మిగిలిన గ్రామాల అబివృద్ది ఎలా…మా గ్రామాల నిధులు ఎక్కడికి తరలి వెళ్లాయి..

               జిల్లా ఎంపీ గా ఉన్న ఆదాల ప్రభాకర్ గారి రెడ్డి గారిని జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ మట్టి గ్రావెల్ అక్రమ రవాణా గురించి ప్రశ్నిస్తే కేవలం నెల్లూరు రూరల్ లో జరగట్లేదని చేయి దులుపుకున్నారు. గ్రామ ప్రజలు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా బయటికి రానికుండా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న మీ పెత్తందారులను చూసి ప్రజలు ఇప్పుడు భయపడుతున్నా రేపు అధికారం మార్చే విషయంలో మాత్రం భయపడే ప్రసక్తి లేదు, ఈ విషయం గుర్తు పెట్టుకోండి… మీరు తెలిపిన లెక్కల ప్రకారం ఏ ఏ రోడ్లు ఎంతెంత శాతం పూర్తయి 45 రోజులు ముందు మీరు శంకుస్థాపన స్టార్ట్ చేసిన పనులు ఎక్కడెక్కడ ప్రారంభించారు. రోడ్లకు పల్లెల రోడ్లు ఎక్కడెక్కడ డ్యామేజీలు ఉన్నాయి. ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ రూరల్ ప్రాంతాల్లో కబ్జాకు గురి అయి ఉన్నాయో చర్చకు నేను సిద్ధమే.. ఆటోల్లో బైకుల్లో పోయే జనాలు ఎంత అవస్థలు పడుతున్నారు నెల్లూరులో ఉండే మీకు తెలియకపోవచ్చు. మీ కార్లు వదిలి మా ఆటోలో వస్తే మా బాధలు ఏమిటో తెలుస్తాయి. వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని దూషించడం లేదు వైసీపీ ప్రభుత్వం గ్రామ నిధులు మళ్లించి గ్రామాలను అభివృద్ధి నోచుకోకుండా చేస్తుందని నేను తెలుపుతున్నాను .అదేవిధంగా అక్రమంగా జిల్లాలో అక్రమ ఇసుక గ్రావెల్ మట్టి రవాణాను అరికట్టాల్సిందిగా నేను బాధ్యతను గుర్తు చేస్తున్నాను. కొత్తూరు ఆమంచర్ల పరిధిలో ఎన్ని ఎకరాల ప్రభుత్వ స్ధలాలు అన్యాక్రాంతమవుతున్నాయో వాటికి కూడా చర్చకు సిద్ధమే. పొట్టే పాలెం కలుజు ఎన్ని రోజుల నుంచి ఆ రోడ్డు ఇబ్బంది కరంగా ఉంది దాన్ని ఏమి చేయగలిగారు అక్కడ వంతెనెందుకు నిర్మించలేకపోయారో సమాధానం,పరిష్కారం చూపాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా నెల్లూరు ములుమూడి గొల్ల కందుకూరు ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి,అక్కచెరువుపాడులో మట్టి తవ్వకాలను ప్రత్యక్షంగా మీడియా దృష్టికి తీసుకువచ్చింది మీరు చూడలేదేమో. లబ్ధి పొందిన వారికి అంతా పెయిడ్ లాగే కనబడతారు సెటిల్మెంట్లు,పంచాయతీలు,డబ్బులు ఇస్తే వచ్చి మాట్లాడడం ఇవన్నీ మేము చేసే పనులు కాదు. అసలు ఎవరో తెలియని వారితో ప్రెస్ మీట్ పెట్టించడం ఎంతవరకు సమంజసం నెల్లూరు రూరల్ ప్రజలకు సగం మందికి మీరు ఎవరో తెలియదు సమాధానం చెప్పాల్సిన వాళ్ళు చెప్తే సమంజసంగా ఉంటుందని భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,కార్పొరేషన్ సెక్రటరీ కృష్ణవేణి, వీర మహిళలు హైమా, కె ఎస్ ఎస్ జిల్లా అధ్యక్షులు సుధా మాధవ్,జనసేన నాయకులు జలదంకి రాము, శ్రీను,కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way