Search
Close this search box.
Search
Close this search box.

జనసేన మద్దతుదారు ఆప్తా నూతన అధ్యక్షులను స్వాగతిస్తూ గునుకుల కిషోర్ ర్యాలీ

గునుకుల కిషోర్

   నెల్లూరు ( జనస్వరం ) : అమెరికాలో సేవా సంస్థ ఆప్త నూతన అధ్యక్షుని స్వాగతిస్తూ జనసేన పార్టీ తరఫున గునుకుల కిషోర్ దాదాపు 500 మంది జనసేన మద్దతు దారులతో కాపు భవన్లో వారి సన్మాన సభకు వెళ్లి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత భావాలు కలిగి సాటి మనిషికి ఏదో ఒక సహాయం చేయాలి అభివృద్ధి పథంలో దేశాన్ని నడిపించాలని ఒక సంకల్పంతో మొదటి నుంచి ఏదో ఒక విధంగా సమాజ శ్రేయస్సుకు పాడుతుపడుతున్న మా నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. లక్షలాది మంది యువత కలల సాకారానికి శ్రమిస్తున్న సామాజిక వాది,దాదాపుగా 30 కోట్ల రూపాయలు ఆర్థికంగా ఇబ్బంది పడి ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు అందించిన సేవా తత్పరుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ ఆప్త సంస్థ దాదాపు మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అమెరికాలోని తెలుగు వారికి సేవలను అందిస్తూ ఐటీ రంగంలో ఉన్నత శిఖరాన్ని అందుకున్న నెల్లూరు వాసి కొట్టే ఉదయ్ భాస్కర్ గారు అప్తా అధ్యక్షులుగా ఎన్నికైన తొలిసారిగా నెల్లూరుకు విచ్చేసిన సందర్భంగా జిల్లా జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ వారిని కలసి జనసేన పార్టీ అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసేందుకు సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ఈరోజు వారిని సత్కరించారు. రోజా అక్క గో బ్యాక్ టు జబర్దస్త్… కళ్లకు సాక్షి గంతలు కట్టుకున్న మీకు ప్రజలకు పడుతున్న ఇబ్బందులు కనపడుట లేదు. మీ ప్రభుత్వం కాపాడుతున్న సుగాలి ప్రీతి రేప్ కేసుల నిందితుల సాక్షిగా పవన్ కళ్యాణ్ గారి కి మహిళల మద్దతు ఎంత ఉందో అందరికీ తెలుసు. మా పవన్ కళ్యాణ్ కి నిజంగా నీలాంటి నోటి పొగరు ఉంటే మహిళలు నచ్చకపోవచ్చు. టూరిజం శాఖ పర్యాటక శాఖలో పూచిక పుళ్లంత అభివృద్ధిని సాధించని మీరు రాజకీయానికి అనర్హులు. రేపు నగరి ఎన్నికలలో ప్రజాక్షేత్రంలో రోజా ఓటమి ఖాయం. రాష్ట్రం రావణ కాష్టంగా ఉంది ఎటు చూసినా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు.ప్రణాలిక బద్ధంగా రాష్ట్ర అభివృద్ధి సాధించాలంటే ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసి గెలిపించండి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కంథర్, ప్రశాంత్ గౌడ్, రాజా, హేమంత్ యాదవ్, అమీన్, షాజహాన్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way