Logo
Date of Publish : 06 October 2023, 8:46 pm
Editor : Sake Naresh

ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించిన గునుకుల కిషోర్

      నెల్లూరు ( జనస్వరం ) : రాజకీయాల్లో జవాబుదారీతనం గురించి యువత ప్రశ్నించాలి అంటూ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుగులు కిషోర్ ఆధ్వర్యంలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని  నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువత ప్రతి ఒక్కరు కూడా ఓటు నమోదు చేసుకొని బాధ్యతగా సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయాలి. ఓటు అనే ఆయుధంతో సమాజాన్ని మార్చవచ్చు. మనకెందుకులే అని నిర్లక్ష్యం వహిస్తే అసమర్థులు రాజ్యమేలుతారు. ఒక అవకాశం అంటూ వేసిన సానుభూతి ఓటు ఈ రోజు రాష్ట్రం అప్పుల్లో ప్రథమ స్థానాన్ని నిలిపింది.  అవగాహన లేకుండా సంపద సృష్టించడం మరిచి అభివృద్ధి గురించి పట్టించుకోక,గ్రామాల అభివృద్ధికి వాడాల్సిన నిధులన్నీ మాయం చేస్తుంది ఈ వైసిపి ప్రభుత్వం. రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి వెళ్తున్న ప్రజా ప్రభుత్వానికి అందరూ మద్దతు ఇచ్చిగెలిపించాలి. ఇంట్లో పెద్దలకు తెలపండి ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా రానున్న రోజుల్లో ఆపేది లేదు. మీ అందరికీ ఇష్టమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి పరిపాలన అవకాసం ఇవ్వాలి. దీనికి మీరు ఓటు వేయడమే కాక మరి కొంతమందిని ఓటు వేయించే బాధ్యత తీసుకోవాలి. నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందించి ఉపాధి అవకాశాలు కల్పించగలిగిన నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించవలసిన ఆవశ్యకత గురించి ప్రతి ఒకరికి తెలపండి. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ప్రశాంత్ గౌడ్, బన్నీ, వర, హేమచంద్ర యాదవ్, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com