Logo
Date of Publish : 27 November 2020, 7:13 am
Editor : Sake Naresh

వరద ఉధృతి కారణంగా ఇళ్లలోకి నీరు రావడంతో ప్రాంతవాసులను పరామర్శించిన జనసేన నాయకులు గునుకుల కిషోర్

వరద ఉధృతి కారణంగా ఇళ్లలోకి నీరు రావడంతో ప్రాంతవాసులను పరామర్శించిన జనసేన నాయకులు గునుకుల కిషోర్

             నెల్లూరు సిటీ ఈద్గామిట్ట ప్రాంతంలో వరద ఉధృతి కారణంగా ఇళ్లలోకి నీరు రావడంతో ప్రాంతవాసులను, నిన్న రాత్రి గాలులకు కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా తగలబడిన ఇంటి వాసులను సందర్శించి బాధితులను జనసేన పార్టీ తరపున గునుకుల కిషోర్ పరామర్శించారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లి నష్ట పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని బాధితులు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళాల్సిందిగా కోరారు. అక్కడే భోజనం ఏర్పాట్లు చేసినట్లుగా తెలియజేసారు.ఎన్నో ఏళ్ల గా ఏటి ఒడ్డున ధుర్బరమైన పరిస్థితుల మధ్య నివశిస్తున్న ఈ ప్రాంత వాసుల పరిస్థితి వరద వస్తే మరింత దయనీయంగా ఉంటుందని జనసేన నాయకులు గునుకుల కిషోర్ అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వీరి నివాసానికి ప్రత్యామ్నాయ స్థలాలను చూపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com