గుంటూరు ( జనస్వరం ) : వైసీపీ అరాచకాలను , దాష్టీకాలనూ అరికట్టి రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు అందించాలి అంటే ప్రస్తుత పరిస్థితుల్లో అది ఒక్క పవన్ కల్యాణ్ కి మాత్రమే సాధ్యమవుతుందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. అక్టోబర్ ఒకటి నుంచి వారాహి విజయయాత్ర నాలుగో విడత ప్రారంభం కానున్న నేపధ్యంలో విజయయాత్రకి సంభందించిన పోస్టర్లను బుధవారం శ్రీనివాసరావుతోటలోని గాజు గ్లాస్ దిమ్మె వద్ద డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. అనంతరం జయహో వారాహి జయ జయహో వారాహి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ వారాహి విజయయాత్రతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించనున్నాయన్నారు. గతంలో వారాహి విజయయాత్ర చేపట్టిన ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనూ , ఉత్తరాంధ్ర జిల్లాలోనూ జరిగిన యాత్రలో వైసీపీ అవినీతి పాలనను పవన్ కల్యాణ్ ఎండగట్టారన్నారు. వైసీపీ నేతల దోపిడీని లెక్కలతో సహా వివరిస్తూ ప్రజల ముందు వైసీపీ నేతల్ని ప్రజాక్షేత్రంలో దోషులుగా పవన్ కల్యాణ్ నిలబెట్టారన్నారు. వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వ తీరుపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రజల్లో వాలంటీర్ వ్యవస్థపై ఆలోచన మొదలైందన్నారు.
నాలుగో విడత యాత్రలో ప్రధానంగా ప్రాథమిక హక్కులపై ప్రజల్లో అవగాహన తీసుకురానున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి గా జగన్ ప్రమాణస్వీకారం చేసిన క్షణం నుంచి రాష్ట్రంలో ప్రజలు వాక్ స్వాతంత్య్రం కోల్పోయారని , భావ స్వేచ్చనూ ఈ ప్రభుత్వం కాలరాసిందని విమర్శించారు. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని తమ దుర్మార్గాలను ప్రశ్నించిన గొంతులను నొక్కుతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ దాష్టీకాలకు సామాన్యుల నుంచి చంద్రబాబు నాయుడు వరకు బాధితులేనన్నారు. ఈ నేపధ్యంలో ప్రజలు తమ హక్కులు తాము పొందేలా జనసేన అధినేత ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల అనంతరం వైసీపీ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని, తెలుగుదేశం, జనసేన కూటమికి విజయాన్ని అందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆళ్ళ హరి అన్నారు. కార్యక్రమంలో జనసేన నగర కమిటీ సభ్యులు బండారు రవీంద్ర, బుడంపాడు కోటి, రామిశెట్టి శ్రీను, టీడీపీ మైనారిటీ నాయకులు షేక్ గౌస్, జనసైనికులు నండూరి స్వామి, వడ్డె సుబ్బారావు, రాంబాబు, బాలాజీ, రేవంత్, తాడికొండ శ్రీను, ఫణి తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com