గుంటూరు ( జనస్వరం ) : ట్రూఅప్ విద్యుత్ చార్జీలు తగ్గించాలని, అమరావతి ఉద్యమకారుల పాదయాత్రకు ప్రభుత్వం సహకరించాలని, SSBN కళాశాలలో జరిగిన లాఠీ ఛార్జ్ విషయంలో వైసీపీ ప్రభుత్వం జ్యూడిషియల్ విచారణ జరిపించాలని ఈ డిమాండ్స్ తో లాడ్జి సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టిన గుంటూరు జిల్లా జనసేన నాయకులు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుంది. అనంతపురంలో S.S.B.N కళాశాల విద్యార్థులు ప్రైవేటైజషన్ కు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తే అమానుషంగా లాఠీఛార్జ్ చేసారు. దీనివల్ల చదువుకోవాల్సిన విద్యార్ధులపై ప్రభావం పడుతుంది. వైసీపీకి ఎలక్షన్ కి వెళ్లే దమ్ము లేక, ప్రజల దగ్గర మొహం చూపించుకోలేక దౌర్జన్యంగా నామినేషన్స్ విత్ డ్రా చేపించి ఏకగ్రీవం చేసుకుంటుంది. వైసీపీ పోలీసుల అండ లేకుండా ప్రత్యక్షంగా స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగితే చిత్తూ చిత్తూ ఓడిపోవడం ఖాయమన్నారు. అనంతపురం ఘటన విషయంలో విద్య శాఖ మంత్రి సురేష్ గారు విద్యార్ధులపై తప్పుని మోపారు. దీని బట్టి అర్ధం అవుతుంది. రాష్ట్రంలో పాలన ఎంత దారుణంగా ఉందో.. విద్యార్ధులపై దాడిని రాష్ట్రము మొత్తం చూసింది అయినా కూడా వైసీపీ వ్యక్తులు అబద్దపు ప్రచారానికి సిద్ధం అవుతున్నారు. దీని బట్టే తెలుస్తుంది వాళ్ళ స్థాయి ఏ విధంగా దిగజారిపోయిందో. ప్రభుత్వాన్ని నడపలేక ప్రభుత్వ భూములు అమ్మి జీతాలు ఇస్తున్నాం అని చెప్పే సిగ్గుమాలిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే-పదే ఈ దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వానికి చెప్తున్నారు పాలన రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం చేయ్యాలి తప్పితే మీ వైసీపీ వ్యక్తుల జేబులు నింపుకోడానికి కాదు. అయినా మీలో మార్పు లేదు. ఇలాగే ఉంటే మిమ్మల్ని రాబోయే ఎన్నికల్లో దగ్గరుండి మిమ్మల్ని ఇంటికి పంపుతామన్నారు.
జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రజలకి ఒక్కటే తెలియజేస్తున్నాం. జగన్ రెడ్డి గారు ప్రచారంలో ఇష్టానుసారంగా ధరలు తాగిస్తామని హామీలు ఇచ్చారు. కానీ నేడు ప్రతి దాని మీద రేట్లు పెరిగిపోయాయి. తన శాఖ ఏంటో కూడా తెలియని ఒక మంత్రి.. బూతుల మంత్రిగా పేరున్న వ్యక్తి కోడలి నాని గారికి చెప్తున్నాం పదే-పదే జనసేనాని మీద అర్ధం లేకుండా విమర్శలు చేస్తే గుడివాడ వచ్చి మీకు బుద్ధి చెప్తాము. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఎవరిని ప్రశ్నించాలి? పేరుకి 151 మంది ఉన్నారు కానీ ఎవరికి ఏమి తెలీదు. మిమ్మల్ని అడగక ఎవరిని అడగాలి? మీ మంత్రులు నిన్న స్టేట్మెంట్ లు ఇస్తున్నారు. రాష్ట్రాన్ని గరిష్టంలో ఉంచుతాం అని..నిజమే ధరలన్నీ గరిష్ఠంగానే ఉన్నాయన్నారు. సిమెంట్, పేపర్ల వ్యాపారంతో మీ వైసీపీ వ్యక్తులు గరిష్ఠంగానే ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.