Logo
Date of Publish : 08 November 2022, 2:17 pm
Editor : Sake Naresh

గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావుని కలిసి అభినందనలు తెలిపిన ఇప్పటం గ్రామ జనసైనికులు

     గుంటూరు, (జనస్వరం) : అధికార పార్టీ వారు ఇప్పటం గ్రామంలో అన్యాయంగా జరిపిన కక్ష సాధింపుల్లో భాగంగా రోడ్డు విస్తరణ అనే నేపంతో గ్రామంలో ఇళ్లను కూల్చివేయడం అలాగే కొందరిపై అక్రమ కేసులు బనాయించటం విషయాలు మనకు తెలిసినవే. గత నెల 31వ తారీకు న PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇప్పడం గ్రామంలో పర్యటనలో కరెంటు తీయించారు. తర్వాత మన ఫ్లెక్షిలను చించి వేయడం జరిగింది. అనంతరం జిల్లా అధ్యక్షుల సలహాతో మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరుసటిరోజు ఉదయం అధికార పార్టీ నాయకులు మా ఇళ్లను రోడ్డు విస్తరణలో భాగంగా కూల్చివేయాలి అని చూస్తున్నారు అని తెలిసి వెంటనే వాటికి సంబంధించిన పేపర్లను రెడీ చేపించి మా చేత హైకోర్టు న్యాయవాది చిదంబరం దగ్గరకు పంపించారు. తర్వాత రోజు ఉదయం 6 గంటలకు రోడ్డు విస్తరణలో భాగంగా ప్రోక్లైన్లు రావడం జరిగింది. ఆ విషయాన్ని వెంటనే గాదె వెంకటేశ్వరరావుకి తెలియజేయడం జరిగింది. తర్వాత మమ్మల్ని అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకెళ్లారని తెలుసుకొని వెంటనే దుగ్గిరాల పోలీస్ స్టేషన్ కి వచ్చి అక్కడ సిఐతో మాట్లాడి మమ్మల్ని ఇప్పటం గ్రామానికి తీసుకొచ్చి మా కుటుంబాల అందరినీ కలిసి అందరికీ మనోధైర్యం ఇచ్చినందుకు మేము ఎప్పుడు ఫోన్ చేసి వెంటనే స్పందించి మాకు ధైర్యాన్ని ఇచ్చిన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావుకి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. అలాగే మా గ్రామానికి వచ్చి మాకు వెన్నుదండగా నిలిచిన రాష్ట్ర జనరల్ సెక్రటరీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, మా నియోజకవర్గ ఇంఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాస్ లకు మరియు  మాకు, మన పార్టీకి అండగా ఉన్న రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, మండల అధ్యక్షులకు, గ్రామ అధ్యక్షులకు, నగర అధ్యక్షులకు మరీ ముఖ్యంగా వీర మహిళలకు, జనసైనికులకు అందరికీ పేరు పేరునా మా ఇప్పటం గ్రామం తరుపున అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com