గుంతకల్ ( జనస్వరం ) : నియోజకవర్గం జనసేన – టిడిపి సమన్వయ బాధ్యుడు వాసగిరి మణికంఠ మరియు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు ఆర్ జితేంద్ర గౌడ్ జనసేన – తెలుగుదేశం పార్టీల ఉమ్మడి సారధ్యంలో “గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది” వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇరు పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి పాత గుంతకల్, వాల్మీకి సర్కిల్ నుండి ధోని ముక్కల రోడ్డు వరకు చిదిలమైన రోడ్డు దుస్థితిని చూపిస్తూ డిజిటల్ క్యాంపెనింగ్ చేస్తూ నిరసన ర్యాలీని నిర్వహించి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ఆర్టీసీ బస్ చార్జీలు పెంచడం, పెట్రోల్, డీజిల్ పై సెస్ పేరిట కోట్లాది రూపాయలు వసూలు పై ఉండే దృష్టి రోడ్లు వేయడంలో లేదు. ప్రజలకు కావాల్సిన మౌళిక వసతుల రూపకల్పనలో వైసిపి ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com