Logo
Date of Publish : 22 April 2022, 3:01 pm
Editor : Sake Naresh

ఆర్టీసీ బస్సు ఛార్జీలు తగ్గించాలని ఆర్టీసీ డిపో వద్ద ఆందోళన చేపట్టిన గుంతకల్లు జనసేనపార్టీ నాయకులు

    గుంతకల్లు, (జనస్వరం) : అనంతపురం జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు టి.సి.వరుణ్ గారి సూచన మేరకు అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్ నేతృత్వంలో జగనన్న బాదుడే బాదుడు పథకం ద్వారా పెరిగిన RTC బస్ చార్జీలను వెంటనే తగ్గించాలని RTC అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆరికేరి జీవన్ కుమార్  మాట్లాడుతూ 2019 లో జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాము, మద్యం దుకాణాలు బంద్ చేస్తాము, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, అక్క ఒక ఛాన్స్, అవ్వ ఒక ఛాన్స్ అని చెప్పి గెలిచి ఈరోజు ఏంచేస్తున్నారు అయ్యా! అంటే.. కరెంట్ ఛార్జీలు బాదుడే బాదుడు.. ఆర్టీసీ చార్జీలు బాదుడే బాదుడు.. ఈ రోజు గుంతకల్లు నుండి గుత్తికి రావాలి అంటే 80 రూపాయిలు. ఎంత పెరిగింది అయ్యా! అంటే 27 రూపాయలు. 2019లో వారు పాదయాత్ర చేసినారు. ఇపుడు ప్రజలు చేస్తారు. మీరు ఇలా పెంచుకుంటూ పోతే, పేద మధ్య తరగతి ప్రజలు రోడ్డున పడుతారు. మీరు పేద, మద్య తరగతి కుటుంబాల రక్తాన్ని పిండుతున్నారు. మీరు వెంటనే ఆర్టీసీ బస్సు ఛార్జీలు తగ్గించాలని లేకపోతే ప్రజల తరపున జనసేనపార్టీ రానున్న రోజుల్లో భారీ ఎత్తున ప్రజాఉద్యమం చేస్తుంది అని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు జనసేన పార్టీ వీరమహిళ విజయ, అనంతపురం జిల్లా కార్యనిర్వహణ కమిటి సభ్యులు సొహైల్, క్రిష్ణ, శేఖర్, గుంతకల్లు మండల అధ్యక్షులు పురుషోత్తం, గుంతకల్లు నాయకులు శేఖర్, విరేష్, విజయ్, మారుతి, మహేష్, జీలాన్, రవి, సర్దార్, ఫిరోజ్, పాండు, ధాద్దు, శివ, వంశీ, రాజు కుమార్, గణేష్, హేమంత్, అరవింద్, లడ్డు, రాకేష్, శశాంక్, విజయ్, మణి, రాము, రాజు, శంకరయ్య, రమేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com