Logo
Date of Publish : 28 February 2022, 2:32 pm
Editor : Sake Naresh

దోనిముక్కల గ్రామంలో స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని MRO గారికి వినతిపత్రం ఇచ్చిన గుంతకల్లు జనసేన నాయకులు

    గుంతకల్లు, (జనస్వరం) : గుంతకల్లు మండలం దోనిముక్కల గ్రామంలో అన్ని వసతులతో కూడిన వైకుంఠధామం (స్మశాన వాటిక) ఏర్పాటు చేయాలని కోరుతూ తహశీల్దార్ కి అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ, గుంతకల్ మండల జనసేన అధ్యక్షుడు కురువ పురుషోత్తం గార్లు వినతిపత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు ఎమ్మార్వోతో మాట్లాడుతూ గుంతకల్లు మండలం దోని ముక్కల గ్రామంలో జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఈ గ్రామానికి ఉన్నటువంటి వైకుంఠధామం (స్మశాన వాటిక) యొక్క స్థలము జాతీయ రహదారి నిర్మాణంలోకి కొంతభాగం వెళ్ళినది. దీనివలన స్మశాన వాటిక చిన్నదవడంతో స్థానిక గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. కావున కొంతభాగం ప్రభుత్వ భూమిని స్మశాన వాటిక కేటాయించి దానికి చుట్టూ కాంపౌండ్ వాల్, బోరు, వాటర్ ట్యాంకు, రోడ్డును ఏర్పాటు చేసి గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ గుంతకల్లు మండల శాఖ తరపున  విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, జనసేన నాయకులు 13 వార్డ్ ఇంచార్జ్ బండి శేఖర్, దోనిముక్కల రాజశేఖర్, కసాపురం సుబ్బయ్య, ఎస్ కృష్ణ, పాండు కుమార్, అల్లు రవి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com