
గుంతకల్లు, (జనస్వరం) : అనంతపూర్ జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి అరికేరీ జీవన్ కుమార్ గారు ఆదేశాల మేరకు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా దర్గాలో పూజలు జరిపించడం జరిగింది. తదనతరం వారు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రములో కులాలకు మరియు మతాలకు అతీతంగా జనసేన పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు అనేక పుట్టినరోజులు జరుపుకోవాలని, నియోజకవర్గములో ఉన్నటువంటి సమస్యలపై జనసేనపార్టీ తరుపున పోరాటాలు చేసి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా పని చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు ఫిరోజ్, సోహైల్, నాసిర్ మరియు సురేష్, విజయ్, గిరి, రవి, తదితరులు పాల్గొన్నారు.