గుంతకల్లు, (జనస్వరం) : అనంతపురం జిల్లా, గుంతకల్లు నియోజకవర్గంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఆ మహనీయుని స్మరించుకుంటూ గుంతకల్ పట్టణం బెంజ్ కొట్టాల అంబేద్కర్ యూత్ మరియు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ గారు మాట్లాడుతూ తల్లి జన్మనిస్తే మనం ఇంత స్వేచ్ఛగా బతకడానికి కారణం అంబేద్కర్ గారు అని అన్నారు. అలాంటి మహనీయుని ఆశయాలను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెంజ్ కొట్టాల అంబేద్కర్ యూత్ మరియు నిస్వార్థ జనసైనికులు పురుషోత్తం, పవర్ శేఖర్, పాండు కుమార్, పామయ్య, విజయ్ కుమార్, మధు, మహేష్ కుమార్, రామంజి తదితరులు పాల్గొన్నారు.