గుంతకల్లు, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం, జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ గారి సూచన మేరకు గుంతకల్లు నియోజకవర్గ జనసేన పార్టీ అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్ ఆధ్వర్యంలో నేడు క్రియాశీల సభ్యత్వం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో ఒక్క గొప్ప ఆలోచనతో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు ఉపయోగపడే విధంగా క్రియాశీల సభ్యత్వంను ప్రవేశ పెట్టారు. జనసేన పార్టీ పేద, బడుగు బహీనవర్గాల పార్టీగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా పార్టీలో రోజువారీ కూలీలే ఎక్కవగా ఉన్నారు. ఎపుడైనా అనుకోకుండ ప్రమాదానికి గురైనప్పుడు చికిత్స కోసం హాస్పిటల్ చేరిన వారికి ఆర్థికంగా అండగా నిలవాలని వారికి చికిత్స కోసం 50వేల వరకు ప్రమాదానికి గురైన వ్యక్తికి జనసేన పార్టీ సహాయ పడుతుంది. అలాగే వ్యక్తి ప్రాణాలు కోల్పోతే ఆ యెక్క వ్యక్తి కుటుంబం రోడ్డున పడకూడదని జనసేన పార్టీ ప్రమాద భీమ ద్వార ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబానికి 5 లక్షలు వరకు జనసేన పార్టీ అండగా నిలుస్తోంది. నియోజకవర్గ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. మన జనసేన పార్టీ అధికారం లేదు. అలాగని ప్రతిపక్షంలో కూడా లేదు. అయిన కూడా పార్టీ కోసం కష్టపడే వాళ్లకు కష్టం వస్తే వాళ్లకు అండగా నిలవాలని క్రియాశీల సభ్యత్వంను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొదలు పెట్టింది. అందులోని గుంతకల్లు నియోజకవర్గం వైసీపీ అరాచక పాలన కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. ఓటర్లు గ్రహించండి. పార్టీ కార్యకర్తల కోసమే ఇంతలా ఆలోచించే జనసేన పార్టీ అధికారంలో వస్తే జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక, ప్రజల కొసం మరియు రాష్ట్ర అభివృధి కోసం జనసేన పార్టీ ఇంకా ఎంతల ఆలోచిస్తుందో అర్థం చేసుకోండి. వైసీపీ చేతకాని పాలనకు నాంది పలకండి 2024 లో వైసీపీ నీ గద్దె దించి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వండని అన్నారు.ఈ కార్యక్రమంలో జనసైనికులు రవితేజ, విజయ్ కుమార్, నవీన్, అలెక్స్, సాయి, ప్రశాంత్, రాము, రాజు, విజయ్, వీరేష్, చిన్న, గణేష్, స్మైలి రాజ్, జీలాన్, రాంబాబు, మణికంఠ, గౌతమ్, ప్రవీణ్, మహేష్, రవితేజ, సోహైల్, హెన్రీ పాల్, ఆర్ సి సురేష్ కుమార్, సాయి, గణేష్ Pspk, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.