Logo
Date of Publish : 14 April 2023, 5:16 pm
Editor : Sake Naresh

గుంతకల్ పట్టణం మెగా అభిమానుల ఆధ్వర్యంలో “చలివేంద్రం” ఏర్పాటు

  గుంతకల్ ( జనస్వరం ) : పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి మరియు జనసేననాని పవన్ కళ్యాణ్ గార్ల సేవా స్ఫూర్తితో గుంతకల్ పట్టణ చిరంజీవి యువత ఆధ్వర్యంలో, చిరంజీవి యువత రాష్ట్ర కార్యదర్శి శ్రీ గోపి, గుంతకల్ అధ్యక్షుడు శ్రీ పాండు కుమార్ గార్లఅధ్యక్షతన "మెగా చలివేంద్రం" స్థానిక చైతన్య థియేటర్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ గారు, బిజెపి నాయకురాలు వనగొంది విజయలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ మాట్లాడుతూ శ్రీ చిరంజీవి గారు కరోనా విపత్కర పరిస్థితిల్లో ఉచిత ఆక్సిజన్ బ్యాంక్ స్థాపించి ప్రజలకు చేసిన సేవలను, జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆత్మహత్య చేసుకున్న 3000 మంది కౌలు రైతు కుటుంబాలకు అండగా ఉండాలని ప్రతి రైతు కుటుంబానికి 1లక్ష రూపాయల చొప్పున తన సొంత నిధులు 30 కోట్లు ఖర్చు పెడుతూ "కౌలు రైతు భరోసా" యాత్ర ద్వారా ప్రజలకు చేస్తున్న సేవలను స్ఫూర్తిగా తీసుకొని వేసవికాలం సందర్భంగా మెగా చలివేంద్రం ఏర్పాటు చేయడం గర్వంగా ఉందని, మనిషి మాధవుడుగా మారే ఏకైక మార్గం 'సేవ' చేయడమే అని, దేశం నాకేమిచ్చింది అని కాకుండాy దేశానికి నేనేమి ఇవ్వగలను అనే సామాజిక బాధ్యతతో మెలగాలని అలాగే రాబోయే రోజుల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మెగా అభిమానులు అంటే సమాజసేవకులు అనే విధంగా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గుర్రం సూర్యనారాయణ, రాష్ట్ర సాయిధరమ్ తేజ్ అధ్యక్షుడు పవర్ శేఖర్, చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు ఎస్. కృష్ణ సీనియర్ నాయకులు పూల ఎర్రి స్వామి, గాజుల రఘు, ఆటో రామకృష్ణ, సాయి ధరంతేజ్ పట్టణ అధ్యక్షుడు ఎంపీ పామయ్య, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అధ్యక్షుడు అల్లు రవి, అల్లు మనోజ్ జనసైనికులు మంజునాథ్, అనిల్ కుమార్, కసాపురం వంశీ, అమర్, దోసెలుడికి మల్లికార్జున, ఆటో బాషా, ఆటో కృష్ణ, ముత్తు,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com