గుంతకల్ ( జనస్వరం ) : నిరుపేదలకు ఇస్తానన్న జగనన్న ఇల్లు రెడీ కాకపోవడంతో సచివాలయానికి మామిడి తోరణాలు కట్టి వినూత్న నిరసన చేసిన గుంతకల్ జనసేన నాయకులు. 2022 జూన్ చివరి కల్లా మొదటి విడతలో భాగంగా ఇల్లు లేని 18 లక్షల 62 వేలు నిరుపేద లబ్ధిదారులకు ఇల్లు కట్టి మామిడి తోరణాలతో అరటి పిలకలతో దేవుని పటంతో గృహప్రవేశం చేయిస్తానన్న ముఖ్యమంత్రి కనీసం 10 శాతం ఇల్లులు కూడా పూర్తి చేయలేదు, కావున అదే మామిడాకులు సచివాలయాల దగ్గర ప్రదర్శించి నిరసన వ్యక్తం చేసిన జనసేన పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో భాగంగా గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, అనంతపురం జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ సచివాలయం సిబ్బందితో మాట్లాడుతూ ఎంతమంది లబ్ధిదారులు ఇల్లు పూర్తి అయ్యింది, ఎంతమంది ఇళ్లకు మామిడాకులు కట్టారు ఇంకా ఎంతమంది ఇల్లు పెండింగ్లో ఉన్నాయి, గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన గడువు ముగిసిన 5 నెలలు కావస్తున్నా, హామీ ఇచ్చిన ఇళ్లల్లో కనీసం 10 శాతం పనులు కూడా జరగలేదు, జనసేన పార్టీ సామాజిక పరిశీలనలో భాగంగా జగనన్న కాలనీలు మరియు టిట్కో ఇల్లా పురోగతి పై పూర్తి వివరాలు ఇవ్వాలని కోరగా, అధికారులు ప్రస్తుతం సమాచారం లేదని చెప్పడంతో రేపటికల్లా ఇవ్వాలని సచివాలయం సిబ్బందితో ఘాటుగా మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంతకల్ పట్టణ అధ్యక్షులు బండి శేఖర్, జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యులు పవర్ శేఖర్, చిరంజీవి యువత అధ్యక్షులు పాండు కుమార్ వీర మహిళలు బండి చంద్రకళ, ఈరమ్మ, లక్ష్మీదేవి, పల్లవి క్రియాశీలక సభ్యులు పామయ్య, రామకృష్ణ, మంజు, రమేష్ రాజ్, అమర్, ఎం.వెంకటేష్, సత్తి, చికెన్ మధు, లారెన్స్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.