Logo
Date of Publish : 15 May 2022, 4:10 pm
Editor : Sake Naresh

గుంతకల్ జనసేన పార్టీ జనసేన నాయకుల ఆధ్వర్యంలో చేరికలు

           గుంతకల్ ( జనస్వరం ) : జనసేనాని సిద్ధాంతాలకు ఆకర్షితులై గుంతకల్ లోని పలుకాలనీలు, గ్రామాలకు చెందిన యువత సుమారు 40 మంది జనసేన పార్టీలోకి చేరారు. జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మరియు పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన పడుతున్న తపన, కౌలు రైతుల సంక్షేమం కోసం ఆయన ప్రారంభించిన కౌలు రైతుల భరోసా యాత్ర , కార్యకర్తల కోసం ఆయన తీసుకువచ్చిన క్రీయాశీలక సభ్యత్వం లాంటి నిర్ణయాలు సుమారు 40 మంది యువకులు జనసేన పార్టీలో చేరారన్నారు. ఈ సందర్భంగా పార్టీలోకి చేరిన పలువురు యువకులు మరియు సీనియర్ నాయకులు మాట్లాడుతూ 2024 లో “ప్రజా ప్రభుత్వం” జనసేనాని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం లో ఏర్పాటు చేసే దిశగా శక్తివంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు. జనసేన పార్టీ చేస్తున్న పోరాటాలను, నిస్వార్థ సేవలను, కౌలు రైతు కుటుంబాలకు అండగా నిలబడిన తీరును క్షేత్రస్థాయిలో గ్రామగ్రామాన తెలిసేవిధంగా అలాగే ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతూ ప్రజలను నిత్యం చైతన్య పరుస్తూ సామాన్యులకు అండగా జనసేన పార్టీ ఉండేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వీర మహిళలు సంధ్యా, సుజాత, ఈరమ్మ, మాధవి జనసేన పార్టీ సీనియర్ నాయకులు బండి శేఖర్, సుబ్బయ్య, పాండు కుమార్, దాదు జిల్లా కార్యనిర్వాహక కమిటీ సభ్యులు పవర్ శేఖర్, ఎస్ కృష్ణ నిస్వార్థ జనసైనికులు పామయ్య, మంజునాథ్, రమేష్ రాజ్, రవితేజ, ఆటో రామకృష్ణ, అమర్నాథ్, రంగా, సత్తి జాన్, శివ, తిమ్మాపురం శివ, కాజా, దాదా, మధు, సూరి, మధు, శీనా, ఆటో పాండు, కసాపురం నంద, వంశీ, ముత్తు, మంజు, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com