Search
Close this search box.
Search
Close this search box.

పవన్ దిష్టిబొమ్మ దగ్ధంతో మైల పడిన ప్రదేశాన్ని పాలతో శుద్ధి చేసిన గుంతకల్ జనసేన శ్రేణులు

పవన్

      గుంతకల్ ( జనస్వరం ) : పట్టణ జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ పిలుపు మేరకు పట్టణ అధ్యక్షుడు బండి శేఖర్ అధ్యక్షతన ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దగ్ధంతో మైల పడిన ప్రదేశాన్ని పాలాభిషేకంతో శుద్ధి చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ మాట్లాడుతూ కూల్చివేతల ప్రభుత్వం మరొక్కసారి అమానుషానికి ఒడిగట్టిందని. అమాయకులైన వాలంటీర్లను భయపెట్టి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వక్రభాషాలు చెబుతూ గుంతకల్ పట్టణం అజంతా సర్కిల్లో పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వాలంటీర్ల పేరుతో యువత జీవితాలు నాశనం చేస్తున్న వైసిపి ప్రభుత్వం ₹5000 వేతనం ఇచ్చి వెట్టి చాకిరి చేయించుకుంటుంది. నాలుగేళ్లుగా ఉద్యోగాలు కల్పించకుండా ఐదు వేల జీవితానికి ఊడిగం చేయిస్తూ బ్రతుకులు నాశనం చేసింది ఎవరని ప్రశ్నించారు, వాలంటీర్ అని మభ్యపెట్టి ప్రభుత్వం ఉద్యోగాల ఉసేత్తకుండా మీ వయస్సు అర్హత లో నాలుగేళ్లు నాశనం చేసి అర్హత లేకుండా చేసింది ఎవరు?, మీ జీవితాలు ఎదిగే అవకాశాలు లేకుండా చేసే 5,000 దగ్గరే ఉంచింది ఎవరు?, వాలంటీర్ వ్యవస్థతో వాలంటీర్ల జీవితాలు మారలేదు వారిని అడ్డం పెట్టుకొని వైసీపీ నాయకులు బాగుపడుతున్నారు అనేది వాస్తవం కాదా, వైసీపీ సభలు సమావేశాలకు ప్రజల్ని తీసుకొచ్చే బాధ్యత మీపై వేశారా లేదా, మీ ప్రాంతాల్లో ప్రజలను మీ చేతే భయపెట్టిస్తున్నారా లేదా గ్రామ వాలంటీర్లు, మీ జీవితాలు అభివృద్ధి లేకుండా చేస్తున్నది ఈ ప్రభుత్వమే ఆలోచించండి అని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వీరమహిళలు బండి సంధ్య, బోయ సుజాత, ఈరమ్మ జనసేన పార్టీ గుంతకల్ పట్టణ అధ్యక్షుడు బండి శేఖర్, జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్, ఎస్. కృష్ణ, గుంతకల్ చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్, కాపు సంక్షేమ సేన నాయకులు బుర్ర అఖిల్ జనసేన సీనియర్ నాయకులు గాజుల రఘు, పూల ఎర్రి స్వామి, ఆటో రామకృష్ణ, కత్తులగేర్ అంజి, కసాపురం నాయకులు నంద, వంశీ, రామంజి, సూర్యనారాయణ, మంజునాథ్, అనిల్, అమర్, ఆటో పండు, శివకుమార్, రాజు, మంజు, లారెన్స్, షఫీ, విజయ్, ఎం.రాజు, కే.మంజు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way