గుంతకల్ ( జనస్వరం ) : గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రరాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులకు పాల్పడుతున్న నిందితులను వెంటనే శిక్షించాలని కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేసిన జనసేన నాయకులు, జనసైనికులు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న వరుస లైంగిక దాడులు, అత్యాచారాలకు ప్రధాన కారణం వైసిపి నాయకుల నిర్లక్ష్య వైఖరే అని ఖండించారు. ఎన్నో సందర్భాల్లో వైసిపి నాయకులు ‘గన్ కంటే ముందు జగన్అన్న’ వస్తాడు అని దిశ చట్టం తో మహిళల భద్రత కల్పిస్తామన్న ప్రభుత్వం వారు ఆ చట్టం ప్రకారం 21 రోజుల్లో ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా శిక్షపడేలా చేయలేదు. ఈ మధ్యకాలంలో సీఎం కార్యాలయం కూతవేటు దూరంలో, విజయవాడ మానసిక రోగి, వేంపల్లి రైల్వే స్టేషన్, గోరంట్ల సామూహిక అత్యాచార ఘటనలకు ఎవరు బాధ్యత వహిస్తారు అని వైసిపి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇకపై పోలీసులే పెద్ద మనసు చేసుకొని ఇలాంటి అత్యాచార ఘటనలు పునరావృతం కాకుండా పెద్ద ఎత్తున నిఘా పెట్టి సుమోటోగా కేసు స్వీకరించాలని విన్నవించారు. అలాగే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ మహిళల రక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేయబోతోందని, మహిళలు జాగ్రత్తగా బయటకు వెళ్లేటప్పుడు పెప్పర్ స్ప్రే లాంటి వస్తువులు కూడా పెట్టుకుని వెళ్లాలని, అవసరమైతే కాళికాదేవిలా తిరిగి ఎదురుదాడి చేయాలని వీరమహిళలకు సూచన చేశారు. వైసిపి ప్రభుత్వం ఆడబిడ్డలను ఎలాగో కాపాడలేదు. కాబట్టి మన బిడ్డలను మానవ మృగాళ్ల బారిన పడకుండా మనమే (తల్లిదండ్రులే) కంటికి రెప్పలా కాపాడుకోవాలని సదా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుంతకల్ మండల అధ్యక్షుడు కురువ పురుషోత్తం జనసేన పార్టీ సీనియర్ నాయకులు బండి శేఖర్, సుబ్బయ్య, పాండు కుమార్, దాదు జిల్లా కార్యనిర్వాహక కమిటీ సభ్యులు పవర్ శేఖర్, ఎస్ కృష్ణ నిస్వార్థ జనసైనికులు పామయ్య, మంజునాథ్, రమేష్ రాజ్, కొనకొండ్ల శివ, హెన్రీ పాల్, రవితేజ, ఆటో రామకృష్ణ, అమర్నాథ్, జాన్, శివ, తిమ్మాపురం శివ, కాజా, దాదా, సూరి, మధు, శీనా, ఆటో పాండు, కసాపురం వంశీ, నంద రవితేజ, ముత్తు, మంజు, తదితరులు పాల్గొన్నారు.