Logo
Date of Publish : 26 October 2022, 5:00 pm
Editor : Sake Naresh

గుంతకల్ పట్టణంలో సమాజానికి సేవ చేస్తున్న యువకుల్ని ఘనంగా సత్కరించిన వాసగిరి మణికంఠ

 గుంతకల్ ( జనస్వరం ) : గుంతకల్ పట్టణంలో సమాజానికి ఉపయోగపడే పలు సేవలు చేస్తున్న యువకులని  అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన సన్మాన సభను ఉద్దేశించి మాట్లాడుతూ నీకోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు. జనం కోసం జీవిస్తే జనం హృదయాల్లో నిలిచిపోతావు. అనే డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ గారి మాటలకు నిలువెత్తు నిదర్శనం మీ లాంటి యువకులు. దేశం నాకేమిచ్చింది అనుకునే ఈ కాలంలో, దేశానికి నేను ఏమి ఇవ్వగలను అని ఆలోచించి సామాజిక బాధ్యతతో, అంతులేని సేవ స్ఫూర్తితో గుంతకల్ పట్టణంలో ఎన్నో బ్లడ్ క్యాంప్స్, పలు సేవా కార్యక్రమాలు జయప్రదం చేయడంలో విశేష కృషి చేసిన మీ అందరికీ నా హాట్సాఫ్ అని అన్నారు.'పద్మభూషణ్" మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి, జనహితం కోరే జనసేనాని పవన్ కళ్యాణ్, సేవా స్ఫూర్తితో సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ జన్మదినాన్ని పురస్కరించుకొని గుంతకల్ పట్టణంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో స్వచ్ఛంద రక్తదాతలతో 143 యూనిట్లు రక్తందానం చేయించడంలో కీలక పాత్ర పోషించి అందరికీ ఆదర్శప్రాయంగా నిలవడం నిజంగా అభినందనీయం అన్నారు. మీలాంటి బాధ్యత గల యువకుల్ని ఈనాడు గౌరవంగా సత్కరించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మీరు ఎల్లప్పుడూ ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గాజుల రఘు, డిష్ లోకేష్, సన్మాన గ్రహీతలు జనసేన పార్టీ గుంతకల్ పట్టణ అధ్యక్షుడు బండి శేఖర్, రాష్ట్ర సాయి ధరంతేజ్ యువత అధ్యక్షులు పవర్ శేఖర్ గుంతకల్లు పట్టణ చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్, మేస్త్రి రామలింగ, పామయ్య, కొనగొండ్ల శివ, రమేష్ రాజ్, ఆటో రామకృష్ణ, చికెన్ మధు, అనిల్ కుమార్, రామకృష్ణ, మంజునాథ్, అమర్, ఐఓసీ శేఖర్, అల్లు రవి, ఆటో కృష్ణ, ఆటో భాష, మహేష్ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com