
న్యూస్ ( జనస్వరం ) : నా సేన కోసం నా వంతు జనసేన పార్టీ కు అండగా గల్ఫ్ సేన జనసేన కార్యక్రమంలో భాగంగా సౌదీ అరేబియా, కువైట్,ఒమన్, బహ్రెయిన్, యూఏఈ, ఖతార్ దేశాల ఐక్య వేదిక గల్ఫ్ సేన జన సేన పార్టీ ఆదేశాల మేరకు 09.09.2022 నాడు “నా సేన కోసం నా వంతు” కార్యక్రమం జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి జన సేన పార్టీ ఉపాధ్యక్షులు మరియు నా సేన కోసం నా వంతు కమిటీ ప్రెసిడెంట్ మహేంద్ర రెడ్డి, కమిటీ కన్వీనర్ ఉదయ్ శ్రీనివాస్, కో కన్వీనర్ రుక్మిణీ, IT విభాగం నుంచి సంజయ్ మరియు కమిటీ మెంబర్ రవి కుమార్ పాల్గొన్నారు.. గల్ఫ్ సేన జన సేన నుంచి ఆరు దేశాల కో ఆర్డినేటర్లు మరియు కోర్ మెంబెర్స్ సుమారుగా 100 మంది ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్నారు. మహేంద్ర గారు నా సేన కోసం నా వంతు గల్ఫ్ లో ఉన్న జన సైనికులను అందరినీ కలుపుకొని ఎలా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలో స్పష్టమైన దిశ నిర్దేశాలు చేశారు.. పార్టీ అధ్యక్షులు వారు పార్టీ కోసం కష్ట పడుతున్న NRIలను గుర్తించి, త్వరలోనే NRI కమిటీని ప్రకటిస్తారు.. ఆ కమిటీ ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలి అని కోరారు. అందుకోసం అధ్యక్షులు వారు కసరత్తు చేస్తున్నట్లు తెలియ చేశారు. ఈ సందర్భంగా ఆరు గల్ఫ్ దేశాల నుంచి సుమారుగా అయిదు వేల మందిని నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో భాస్వామ్యులను చేస్తామని గల్ఫ్ సేన జన సేన సభ్యులు రాష్ట్ర కమిటీకి తెలియచేశారు.. అయిదు వేల మందిని భాగస్వామ్యులను చేసే కార్యక్రమాన్ని గల్ఫ్ దేశాల్లో ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలో సభ్యులు మధ్య చర్చ జరిగిన అనంతరం, కార్యాచరణ రూపొందించారు. నా సేన కోసం నా వంతు కమిటీ సభ్యులు అందరూ, గత నాల్గు సంవత్సరాలుగా పార్టీ నీ బలోపేతం లో భాగ స్వాములు గా ఉన్న గల్ఫ్ సేన జన సేన సభ్యులు అందరికీ పేరు పేరు న దన్యవాదములు తెలియ చేసారు. రాజకీయాల్లో మార్పు కోసం,భావి తరాల బంగారు భవిష్యత్తు కోసం, నిత్యం ప్రజల పక్షాన నిరంతరం శ్రమిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీ అండగా నిలబడాలని, పార్టీలో భాగస్వాములు అయ్యేందుకు విరాళాలు అందిద్దాం అని, మరింత బలంగా వ్యవస్థ మార్పు కోసం పోరాడుదాం అని గల్ఫ్ సేన జన సేన సభ్యులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి జనసైనికుడికి, పార్టీకి అండగా నిలబడి విరాళాలు అందిస్తున్న ప్రతీ ఒక్కరికీ పేరుపేరున గల్ఫ్ సేన జనసేన కృతజ్ఞతలు తెలియజేసారు.