Logo
Date of Publish : 07 August 2021, 2:53 am
Editor : Sake Naresh

సుగాలి ప్రీతి కుటుంబానికి 50,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన గల్ఫ్ జనసేన నాయకులు

      కర్నూలు,  (జనస్వరం) :  పాశవిక దాడిలో అశువులు బాసిన కర్నూలు పట్టణానికి చెందిన సుగాలి ప్రీతి కుటుంబం ఆర్ధిక ఇబ్బందులు చూసి చలించిన గల్ఫ్ - జనసేన నాయకలు  ఆ కుటుంబానికి అండగా ఉండేందుకు సుగాలి పార్వతమ్మకు రూ.50,000/- నగదును గల్ఫ్ - జనసేన ప్రతినిధులు మాదాసు నరసింహ గారు, గుంటూరు జిల్లా నుంచి యర్రగోపుల జయదీప్ గారు అందజేయడం జరిగినది.ఈ సందర్భంగా యర్రగోపుల జయదీప్ మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో గల్ఫ్ జనసేన తరపున శ్రీ చందక రామ్ దాస్ గారు, శ్రీ బాణావతి రామచంద్ర నాయక్ గారు, శ్రీ కేసరి త్రిమూర్తులు గారు, శ్రీ పగడాల అంజన్ కుమార్ గారు, శ్రీ కంచన శ్రీకాంత్ గార్ల సహాయ సహకారాలతో  కర్నూలు వచ్చి సుగాలీ ప్రీతీ కుటుంబ సభ్యులకు  నగదును అందజేయడం జరిగిందని తెలిపారు. శ్రీ మాదాసు నరసింహ మాట్లాడుతూ సమాజ సేవే లక్ష్యంగా పేదలకు, ఆపదలో ఉన్నవారికి గల్ఫ్  జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా జనసేన పార్టీ నాయకులు శ్రీ షేక్ అర్షద్ గారు, శ్రీ అరిగెల నాగేష్ గారు, శ్రీ మామిళ్ల సురేష్ గారు, శ్రీ ఓబులేష్ గారు,శ్రీ సుధాకర్ గారు‌ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com