Logo
Date of Publish : 28 September 2021, 10:18 am
Editor : Sake Naresh

గులాబ్ తుపాను బాధితులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలి – జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్

   హైదరాబాద్, (జనస్వరం) : గులాబ్ తుపాను సృష్టించిన బీభత్సం, భారీ వర్షాల వల్ల ఉత్తరాంధ్ర నుంచి, కృష్ణా జిల్లా వరకూ అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి... వేలాది ఇళ్ళల్లోకి నీళ్ళు ప్రవేశించి జనజీవనం అస్తవ్యస్తం కావడం బాధాకరమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కోరారు. ఉత్తరాంధ్రలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయం దెబ్బ తినడంతో ప్రజలు అంధకారంలో ఉన్నారని అన్నారు. వీలైనంత త్వరగా విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలను పునరుద్ధరించాలని సంబంధిత శాఖలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. జనసేన నాయకులు, శ్రేణులు తమ పరిధిలో బాధితులకు సహాయపడాలని కోరారు.
ప్రకృతి విపత్తులకు నష్టపోయే వర్గం రైతాంగమే :
"అప్పులు చేసి, కాయకష్టంతో సాగు చేసే రైతులు తుపాన్లు, భారీ వర్షాల వల్ల తీవ్రంగా దెబ్బ తింటున్నారు. గులాబ్ తుపాను మూలంగా సుమారు 2 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు తెలిసింది. ఎక్కువ మేర వరి దెబ్బతిందని, పంట నష్ట పరిహారం లెక్కించడంలో ప్రభుత్వం అనుసరించే విధానాలు మారితేనే రైతులకు మేలు జరుగుతుంది. నామ మాత్రపు సాయంతో సరిపెడితే ప్రయోజనం ఉండదు. నివర్ తుపాను సమయంలో పంటలు దెబ్బ తిన్న ప్రాంతాల్లో పర్యటించినప్పుడు రైతులు, కౌలు రైతుల ఆవేదన స్వయంగా తెలుసుకున్నాను. ఎకరానికి రూ.25 వేలు నుంచి రూ.30 వేలు వరకూ పరిహారం ఇస్తేనే రైతులు కోలుకోగలరు. ఈ దిశగా ఇప్పుడైనా ఆలోచన చేయాలి" అని అన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com