ఎమ్మిగనూరు ( జనస్వరం ) : గోనెగండ్ల మేజర్ గ్రామ పంచాయితి పరిధిలో వేసవి ముంచుకొస్తున్న కొద్దీ నీటి కష్టాలు రోజు రోజుకు పెరుగుతుంటే ప్రజలు పడుతున్న నీటి కష్టాలను పరిష్కరించేది మరచిపోయి మా నమ్మకం మా భవిష్యత్తు అంటూ పోస్టర్లు అంటించడం హాస్యాస్పదంగా వుందని జనసేన పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ మీడియా ఇంచార్జి గానిగ బాషా పేర్కొన్నారు. డిగ్రీలు చేతపట్టుకొని ఉద్యోగాలు లేవనే నమ్మకం నిరుద్యోగులకు ప్రభుత్వం ఎప్పుడో కల్పించిందని అన్నారు. రెక్కల కష్టాన్ని నమ్ముకొని ఉన్నత చదువులను చదివించిన తల్లిదండ్రులకు అండగా వుండి ప్రశాంతమైన భవిష్యత్తు ఇవ్వలేని పట్టభద్రులు ఎందరో ఇప్పటికి పెద్దల కష్టంపైనే ఆధారపడి జీవిస్తుంటే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాత్రం ఎవరికి నమ్మకం కలిగిస్తోందో ఎవరి తలరాతలు మార్చివేసి బంగారు భవిష్యత్తు వేస్తుందో అర్థం కావడం లేదన్నారు. పోస్టర్ల పేరుతో ప్రచార ఆర్భాటాలు చేసే ముందు ఒక్కసారి ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించి పరిష్కారం చేసేలా కృషిచేయాలన్నారు. అప్పుడే నాయకులపై ప్రజలకు నిజమైన నమ్మకం కలిగి రాబోయే ఎన్నికల్లో ప్రజలే మంచి భవిష్యత్తు ఇస్తారన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలను నీటి కష్టాలు పట్టిపిడిస్తుందని చివరికి నీటి విషయంలో కూడా రాజకీయాలు చేయడం దారుణం అన్నారు.