గుడివాడ ( జనస్వరం ) : గుడివాడ పట్టణ స్థానిక బస్టాండ్ సెంటర్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచ మే డే సందర్భంగా కార్మికులకు సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేసిన గుడివాడ పట్టణ జనసేన నాయకులు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ కార్మికుల కష్టం లేకుండా ఎవరికీ ఏమీ సాధ్యం కాదు. ఏమీ సాదించలేము కూడా... శ్రామికుడి చమటలోనుంచి,కార్మికుడి కండరాలలోనుంచి పుట్టిందే జనసేన పార్టీ అని అలాంటి పార్టీకి మేము కార్యకర్తలుగా పనిచేయడమే మా అదృష్టంగా భావిస్తున్నామని తెలియజేసినారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన సిద్ధాంతాలు ప్రజలకు తెలియజేసి జనసేన పార్టీని గుడివాడలో బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్దాం అని తెలియజేశారు అదేవిధంగా కార్మిక సోదరులకు, సంఘాలకు ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుడివాడ జనసేన పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ మీరా షరీఫ్ గారు, నూనె అయ్యప్ప, గంట అంజి, దివిలి సురేష్, చరణ్ తేజ్, నాగ సాయి, జి శ్రీనివాసరావు, మరియు జన సైనికులు, ముఠా కార్మికులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com