Logo
Date of Publish : 20 October 2023, 8:07 pm
Editor : Sake Naresh

అత్యవసర పరిస్థితిలో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన గుడివాడ పట్టణ జనసైనికులు

      గుడివాడ ( జనస్వరం ) :  గుడివాడ పట్టణ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గుడివాడ పట్నానికి చెందిన శారద అనే మహిళకు తీవ్ర రక్తస్రావంతో ఇబ్బంది పడడంతో అక్కడ ఉన్న స్థానికులు గుడివాడ పట్టణ ఆర్కే వారియర్స్ కి తెలియజేయగా వెంటనే స్పందించి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన గుడివాడ పట్టణ ఆర్కే వారియర్స్.  ఈ సందర్భంగా సామాజికవేత్త డాక్టర్ మాచర్ల రామకృష్ణ (RK) మాట్లాడుతూ రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అనే చిరంజీవి గారి పిలుపు మేరకు గుడివాడ పట్టణంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అనేకసార్లు రక్తదానం చేసి ప్రజలకు తోడుగా ఉంటున్నామని ఈరోజు గర్భిణీ స్త్రీ కి అత్యవసరంగా రక్తం అవసరం అవడంతో మమ్మల్ని సంప్రదించగా వెంటనే రక్తదానం చేసి ఆ తల్లి ప్రాణాలు కాపాడడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా చాలామంది యువత రక్తం ఇవ్వాలంటే లేనిపోని అపోహాలు మనసులో పెట్టుకుని రక్తం ఇవ్వడానికి ముందుకు రావట్లేదని అవేమీ మనసులో పెట్టుకోకుండా ఇప్పటివరకు దగ్గర దగ్గర 53 సార్లు రక్తదానం చేసి ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నానని తల్లి జన్మనిస్తే రక్తదాత పునర్జన్మణిస్తారని... దయచేసి అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని అన్నారు. మేము అడిగిన వెంటనే స్పందించిన మా తమ్ముడు తేనెల ప్రభు గారికి మా ఆర్కే వారియర్స్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో నూనె అయ్యప్ప, మరియు ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com