Logo
Date of Publish : 22 December 2022, 3:54 pm
Editor : Sake Naresh

స్పీడ్ బ్రేకర్లు మీద ప్రమాద సూచికలు వేసి ప్రమాదాలు నివారించిన గుడివాడ పట్టణ జనసైనికులు

      గుడివాడ ( జనస్వరం ) : పట్టణ స్థానిక ఏలూరు రోడ్డు కోర్టు ప్రాంగణం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ వల్ల ఒక వాహనదారుడు అదుపుతప్పి పడిపోవడంతో తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ విషయం తెలుసుకున్న గుడివాడ పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ వంశీ, Rk వారియర్స్ తెలియజేయగా గుడివాడ పట్టణ ట్రాఫిక్ పోలీస్ సంప్రదించి ఆ స్పీడ్ బ్రేకర్స్ కి ఇరువైపులా ప్రమాద సూచికలు ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (Rk) మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సమాజం మీద బాధ్యత నిర్వహించాలని ఈ స్పీడ్ బ్రేకర్ వల్ల వాహనదారులు ఇబ్బంది పడడంతో స్పందించిన గుడివాడ పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ వంశి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని తెలియజేశారు. ఎవరికి వారు బిజీ లైఫ్ లో ఉండి సమాజాన్ని పట్టించుకునే నాధుడే లేడు ఎవరు ఏమైపోతున్న నాకెందుకులే అనే ఆలోచన గానీ సమాజానికి సేవ చేయాలని ప్రతి ఒక్కరికి ఉండాలి. గుడివాడ పట్టణ మున్సిపల్ అధికారులకి మా యొక్క విన్నపం ఏమిటంటే స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి స్పీడ్ బ్రేకర్లు వేశారు అది మంచి ఆలోచన కానీ కొత్తగా వేసిన స్పీడ్ బ్రేకర్ వల్ల వాహనదారులు తెలియక అనేక ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి దయచేసి ఇలాంటి వేసినప్పుడు ప్రమాద సూచికలు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరగవని మా ఆలోచన అలాగే ఏలూరు రోడ్ లో ఉన్న విద్యుత్ లైట్లు కూడా సరిగ్గా పని చేయకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు దయచేసి మా విన్నపాన్ని మన్నించి తగిన మరమ్మతులు చేయవలసిందిగా కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన డాక్టర్ వంశీ గారికి, ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్ గారికి, మరియు మా జన సైనికులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com