Logo
Date of Publish : 31 October 2022, 5:41 pm
Editor : Sake Naresh

అనాధ మృతదేహానికి అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటిన గుడివాడ పట్టణ జనసైనికులు

       కృష్ణా ( జనస్వరం ): గుడివాడ పట్టణ నీలామహల్ రోడ్లో గత కొంతకాలం నుంచి ఒంటరిగా జీవిస్తున్న గేదెల లక్ష్మి అనారోగ్యంతో చనిపోవడంతో అక్కడ ఉన్న స్థానికులు గుడివాడ పట్టణ జనసైనికులకు తెలియపరచగా వెంటనే స్పందించిన జన సైనికులు పోలీసువారికి సమాచారం అందించి ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (Rk) మాట్లాడుతూ కొందరి జీవితంలో రక్త సంబంధాలు కూడా దూరం అయ్యి నేడు ఆర్థిక బంధాలు అయ్యేంతగా అభివృద్ధి చెందుతున్నారు. అందుకే ఇలా అనాథులుగా ఈ మరణాలు జరుగుతున్నాయని, నా అనే బంధాలకు దూరం అయి తనువు చాలించిన ఈ వృద్ధ తల్లికి ఒక కొడుకుగా నా బాధ్యత తీసుకొని అంత్యక్రియలు చేయడం జరిగిందన్నారు.  మానవసేవే - మాధవసేవ అనే నినాదంతో జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో కుల మతాలతీతంగా సేవ కార్యక్రమలు చేస్తున్న మా జనసైనికులను మీ నిండు మనసుతో మమ్మల్ని ఆశీర్వదించలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ మీరా షరీఫ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అయ్యప్ప, సురేష్, గంట అంజి, చరణ్, జగదీష్, షేక్ కరీం, మరియు డాన్స్ మాస్టర్ ఆర్య పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com