Logo
Date of Publish : 14 October 2022, 4:26 pm
Editor : Sake Naresh

అనాధ మృతదేహానికి అంతక్రియలు చేసి మానవత్వాన్ని చాటిన గుడివాడ పట్టణ జన సైనికులు

      గుడివాడ, (జనస్వరం) : కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలో భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వృద్దుడు అనారోగ్యంతో మరణించడంతో అక్కడ ఉన్న స్థానికులు గుడివాడ పట్టణ జన సైనికులకు తెలియజేయగా వెంటనే స్పందించిన జనసైనికులు పోలీసువారికి వివరాలు తెలియజేసి అంత్యక్రియలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (Rk) మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అని నినాదంతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో గుడివాడ పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అలాగే ఎంతోమంది అభాగ్యులు అనారోగ్యంతో చనిపోవడంతో ఆ మృతదేహాలను సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమనికి నాకు సహకరిస్తున్న నా మిత్రులకు నా టీం సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు. రక్త సంబంధం లేకున్నా, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ వృద్ధుడికి ఆహారం అందిస్తూ అదే చేత్తో అంత్యక్రియలు చేయడం చాలా బాధగా ఉందని ఏనాటి రుణ బంధమో ఒక కొడుకుగా బాధ్యత తీసుకుని ఆ వృద్దుడుకు తమ సాంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు చేసి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ముస్లిం మైనారిటి నాయకులు షేక్ కరీం, అయ్యప్ప, జగదీష్, సురేష్, అంజి, జన సైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com