Search
Close this search box.
Search
Close this search box.

అనాధ మృతదేహానికి అంతక్రియలు చేసి మానవత్వాన్ని చాటిన గుడివాడ పట్టణ జనసైనికులు

     గుడివాడ, (జనస్వరం) : కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ స్థానిక బస్టాండ్ సెంటర్లో భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వృద్ధమాత అనారోగ్యంతో మరణించడంతో అక్కడ ఉన్న స్థానికులు గుడివాడ పట్టణ జనసైనికులకు తెలియజేయగా వెంటనే స్పందించిన జనసైనికులు పోలీసువారికి వివరాలు తెలియజేసి అంత్యక్రియలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (Rk) మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అని నినాదంతో జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో గుడివాడ పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అలాగే ఎంతోమంది అభాగ్యులు అనారోగ్యంతో చనిపోవడంతో ఆ మృతదేహాలను సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమనికి నాకు సహకరిస్తున్న నా మిత్రులకు నా టీం సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు. రక్త సంబంధం లేకున్నా, జీవించి ఉన్నప్పుడు పరిచయం లేకపోయినా ఏనాటి రుణ బంధమో ఒక కొడుకుగా బాధ్యత తీసుకుని ఆ అమ్మకు తమ సాంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు చేసి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ముస్లిం మైనిరిటి నాయకులు షేక్ కరీం, అయ్యప్ప, జగదీష్, సురేష్, అంజి, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way