Logo
Date of Publish : 30 April 2022, 7:01 am
Editor : Sake Naresh

మూగజీవులకు దాహం తీరుస్తున్న గుడివాడ పట్టణ జనసైనికులు

     గుడివాడ, (జనస్వరం) : కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో అనేక చోట్ల మూగజీవులకు నీటి కుండీలను గుడివాడ పట్టణ జనసైనికులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (RK) మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో పట్టణంలో ప్రజలకు చలివేంద్రాలుతో పాటు మూగజీవులకు నీటి కుండీలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. దయచేసి ప్రజలు మీ ఇంటి పరిసర ప్రాంతాలలో మూగజీవాలకు పక్షులకు నీరుని అందించాలని కోరారు. జీవితమంటే జననం మరణం కాదని సమాజానికి పదిమందికి ఉపయోగపడినప్పుడే ఆ జీవితానికి పరమార్ధం అని తెలియజేశారు. మా పార్టీ అధికారంలో లేకపోయినా ప్రజా సమస్యలను గుర్తించి సమస్యల మీద పోరాటం చేస్తున్నామని, సేవే మార్గం - ప్రేమే లక్ష్యం అని ప్రజలతో మమేకమై ఉంటున్నామని గుడివాడ పట్టణ ప్రజలు నిండు మనసుతో మా అందరినీ ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ కరీం, చరణ్, అయ్యప్ప, జగదీష్, మెకానిక్ మూర్తి, చింత దుర్గా రామకృష్ణ, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com