
గుడివాడ, (జనస్వరం) : పదోతరగతి పరీక్షలు హాజరయ్యే విద్యార్థులందరుకు జనసైనికులు ఆల్ ద బెస్ట్ చెబుతూ ఉచిత మజ్జిగను గుడివాడ పట్టణ జనసైనికులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (RK) మాట్లాడుతూ విద్యార్థులందరికీ జనసేన పార్టీ తరఫున ఆల్ ద బెస్ట్ తెలుపుతూ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల విద్యార్థులకు చల్లటి మజ్జిగ అందజేయడం జరిగిందని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారు ఆశయాలతో శ్రీమతి డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో సమాజానికి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అని తెలియజేశారు. సేవే మార్గం ప్రేమ లక్ష్యమని ప్రజలతో దగ్గరగా ఉంటూ ప్రజా సమస్యలపైన పోరాడుతూ ఎల్లప్పుడూ ఉండాలని తెలియజేశారు. ప్రజలందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ కరీం, చరణ్, పవన్, చందు, రామకృష్ణ, మెకానిక్ మూర్తి, జనసేన నాయకులు పాల్గొన్నారు.