Logo
Date of Publish : 24 May 2022, 12:58 pm
Editor : Sake Naresh

సొంత నిధులతో రోడ్డుపై ఉన్న గుంతలు పూడ్చిన గుడివాడ పట్టణ జనసైనికులు

     గుడివాడ, (జనస్వరం) : కృష్ణాజిల్లా గుడివాడ నుంచి విజయవాడ వెళ్లే ఓవర్ బ్రిడ్జి పైన పూర్తిగా గుంతల మయం తో ప్రజలు ఇబ్బందులు గమనించిన పట్టణ జనసైనికులు సొంత నిధులతో గుంతలు పూడ్చటం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు రామకృష్ణ (RK) మాట్లాడుతూ గుడివాడ నుంచి విజయవాడ కు వేలాది వాహనాలు మరియు నాయకులు అధికారులు తిరుగుతున్నారు కానీ ఏ ఒక్క అధికారి నాయకుడు గాని పట్టించుకున్న దాఖలాలు లేవు. గోతులు వల్ల ప్రజలు ఇబ్బంది పడటంతో మా సొంత నిధులతో గోతులు పూడ్చటం జరిగింది అని తెలియజేశారు. ఇప్పటికైనా ఆర్ అండ్ బి వారు మున్సిపల్ అధికారులు రోడ్డు మీద ఉన్న గుంతలను పూడ్చి వాహనదారులను మరియు ప్రజలను ఇబ్బంది లేకుండా చూడాలని తెలియజేశారు. రోడ్డుపై వెళ్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు మండుటెండలో వాళ్ళు పడుతున కష్టాన్ని చూసి ప్రభుత్వం చేయలేకపోయినా మీ జనసైనికులు చేస్తున్నారని మీకు మీ నాయకుడుకు మంచి రోజులు వస్తాయి అంటూ పలువురు వాహనదారులు అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అయ్యప్ప, జగదీష్, చింత దుర్గా రామకృష్ణ, నాగ సాయి, చరణ్, పలనాటి అజయ్, ఎమ్మెల్యే ప్రకాష్, నాగ శీను, మెకానిక్ మూర్తి గారు స్థానిక యువత పాల్గొని కార్యక్రమం నిర్వహించడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com