Logo
Date of Publish : 10 February 2023, 4:59 pm
Editor : Sake Naresh

రక్తదాత పురస్కార్ అవార్డు అందుకున్న గుడివాడ పట్టణ జనసైనికులు

 గుడివాడ ( జనస్వరం ) : కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలో అత్యధిక రక్తదానం చేసి యువతకు స్ఫూర్తినిచ్చిన జనసేన Rk ని అభినందించి రక్తదాత పురస్కార్ అవార్డు అందజేసిన విజయవాడ హెల్పింగ్ హాండ్స్ సభ్యులు ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (Rk) మాట్లాడుతూ రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అనే చిరంజీవి గా.రి పిలుపుమేరకు గుడివాడ పట్టణంలో అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందజేయడం కాకుండా యువతకు రక్తదానం గురించి అవగాహన చేసి గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం అందజేయడం జరుగుతుందని అలాగే చాలామంది రక్తదానం చేయాలంటే లేనిపోని అపోహలతో భయపడుతూ ఉంటున్నారని అన్నారు. నేను ఇప్పటికి 53 సార్లు రక్తదానం చేసిన ఆరోగ్యంగా ఉంటున్నానని దయచేసి గుడివాడ పట్టణంలో ఉన్న ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని తెలియజేశారు హెల్పింగ్ హాండ్స్ వారు మేము చేసిన సేవలను గుర్తించి కృష్ణాజిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండిరెడ్డి రామకృష్ణ గారి చేతుల మీదగా రక్తదాత పురస్కార్ అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. అలాగే ఈ అవార్డు మా టీం సభ్యులకు మరియు నా స్ఫూర్తి ప్రదాతజనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ గారికి అంకితం అని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్స్ అధ్యక్షులు మరీదు శివరామకృష్ణ, జనసేన పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ మీరా, షరీఫ్, అయ్యప్ప, చరణ్, సురేష్ మరియు జన సైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com