Logo
Date of Publish : 06 January 2023, 3:45 pm
Editor : Sake Naresh

అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బాధితులను ఆదుకున్న గుడివాడ పట్టణ జనసైనికులు

        గుడివాడ, (జనస్వరం) : కృష్ణాజిల్లా గుడివాడ మండల చిరిచింతల గ్రామంలో వ్యవసాయ కూలి అయిన సాంబయ్య  ఇల్లు విద్యుత్ షార్ట్ అయ్యి మంటలు వ్యాపించి పూరిగుడిసె అగ్నికి ఆహుతి అవడం జరిగింది. అక్కడ ఉన్న స్థానికులు గుడివాడ పట్టణ జన సైనికులు తెలియజేయగా వెంటనే స్పందించి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వారికి సహాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (Rk) మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అనే నినాదంతో ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ  ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో గుడివాడ పట్టణంలో అనేక సేవలు చేసుకుంటూ వెళ్తున్నామని అదేవిధంగా చిరుచింతల గ్రామానికి చెందిన ఒక పేద కుటుంబo పూరిగుడుసు అగ్నికి ఆహుతయి రెండు రోజులు కావస్తున్న ప్రభుత్వ అధికారులు గానీ రాజకీయ నాయకులు గానీ పరామర్శించకపోవడం చాలా దౌర్భాగ్యం అని తెలియజేశారు. ఏదేమైనా ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు ప్రజా సేవకుడు దగ్గరగా ఉండాలని వారికి మంచి చెడు చూడాలని అంతేగాని ఓట్లు ఎలక్షన్ ముందు నేనున్నానని భరోసా ఇచ్చి ఇలాంటి ప్రమాదవశాత్తు సమయంలో పట్టించుకోవడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిని తెలియజేశారు. ఏదేమైనా సాంబయ్య  కుటుంబాన్ని పరామర్శించి వారికి మా వంతు సహాయంగా నెల రోజులు సరిపడే నిత్యవసర సరుకులు బియ్యం మరియు దుప్పట్లు అందజేయడం జరిగిందని అలాగే ప్రభుత్వ అధికారులు కానీ సేవా సంస్థలు గాని ఒకసారి ఈ కుటుంబాన్ని వీక్షించి వారికి ఏదో విధంగా సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అయ్యప్ప, షేక్ మీరా షరీఫ్, చరణ్, సురేష్, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com