Logo
Date of Publish : 23 August 2022, 2:28 am
Editor : Sake Naresh

అత్యవసర పరిస్థితిలో రక్తదానం చేసిన గుడివాడ పట్టణ జనసైనికులు

     గుడివాడ, (జనస్వరం) : కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఒక గర్భిణీకి తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే స్పందించిన గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (Rk) రక్తదానం చేసి ప్రాణాలు కాపాడడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (Rk) మాట్లాడుతూ ఈరోజు రక్తదాతల స్ఫూర్తి పద్మభూషణ్ చిరంజీవి జన్మదిన సందర్భంగా ఆయన పేరు మీద నిండు గర్భిణీకి రక్తదానం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అని తెలియజేశారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే సిద్ధాంతాన్ని తెలియజేసిన మా అభిమాన నటుడు చిరంజీవి నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నారని తెలియజేశారు. దయచేసి గుడివాడ పట్టణంలో ఉన్న యువత రక్తదానం వల్ల లేనిపోని అపోహలు పెట్టుకుంటున్నారని మనకి తల్లి జన్మనిస్తే రక్తదాత పునర్జన్మ ఇస్తారు. రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అని చిరంజీవి స్ఫూర్తితో గుడివాడ పట్టణంలో 48 సార్లు రక్తదానం చేసిన నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని ప్రజల్లో లేనిపోని అనుమానాలు పెట్టుకుని రక్తదానం ఇవ్వకుండా చేస్తున్నారని రక్తదానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడు కలుగుతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అయ్యప్ప, సురేష్,జగదీష్, ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ కరిం, చరణ్, జన సైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com