Logo
Date of Publish : 06 January 2022, 2:17 am
Editor : Sake Naresh

డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపిన గుడివాడ పట్టణ జనసేనపార్టీ నాయకులు

     గుడివాడ, (జనస్వరం) : కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ బస్టాండ్ బయట డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడటంతో ఆ సమస్యని గుడివాడ పట్టణ మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ గారికి జనసేన పార్టీ తరఫున వినతి పత్రం ద్వారా తెలియజేయగా వెంటనే స్పందించి డ్రైన్ లో ఉన్న చెత్త చెదారం మున్సిపల్ కార్మికుల ద్వారా తొలగించడం జరిగింది.. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (Rk) మాట్లాడుతూ ఈ సమస్యలు పరిష్కరించిన గుడివాడ పట్టణ మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ గారికి మున్సిపల్ కార్మికులకు జనసేన పార్టీ తరఫున మరియు గుడివాడ పట్టణ ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.. అలాగే ఈ న్యూస్ ను టెలికాస్ట్ చేసిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పత్రిక విలేకరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలిపారు. గుడివాడ పట్టణంలో ప్రతివారు పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని ఎక్కడ సమస్య వచ్చినా ఆ సమస్యను ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తే ఆ సమస్యలు పరిష్కరిస్తారని. మనకెందుకు మనకెందుకు అనుకుంటే గుడివాడ పట్టణ అభివృద్ధి కుంటుపడుతుందని ప్రశ్నించేవాడు లేకపోతే బెదిరించే వాడిదే రాజ్యం అవుతుందని.. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి సమస్యల మీద పోరాడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అయ్యప్ప, చరణ్, జగదీష్, కార్తీక్, ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ కరీం, మరియు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com