Logo
Date of Publish : 21 April 2022, 2:40 pm
Editor : Sake Naresh

అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన కుటుంబాలను ఆదుకున్న గుడివాడ జనసైనికులు

   గుడివాడ, (జనస్వరం) : కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ స్థానిక ధనియాల పేట వార్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి పూర్తిగా ఇల్లు కాలిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న గుడివాడ పట్టణ జనసైనికులు వారిని పరామర్శించి సహాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (Rk) మాట్లాడుతూ ధనియాల పేటకు చెందిన రాము ఇల్లు అగ్నికి పూర్తిగా కాలిపోవడంతో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో ప్రాణాలతో బయటపడ్డారు అని వారిని పరామర్శించి మా వంతు సహాయంగా వారికి మూడు నెలలకు సరిపడే బియ్యం కూరగాయలు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా ఎన్నో సేవా సంస్థల వారు ఉన్నారని వారు కూడా కుటుంబ సభ్యులు పరిస్థితి చూసి వారినీ ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వ అధికారులు హౌసింగ్ లోన్ ఇప్పించి ఇల్లు కట్టించాలని కోరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎక్కడ కష్టం వస్తే అక్కడ జనసైనికులు ఉంటారని తమ వంతు సహాయం చేసుకుంటూ ప్రజల్లో ఉంటారని తెలియజేశారు. అక్కడి స్థానికులు జనసేన సైనికులుని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ కరిం, అయ్యప్ప, జగదీష్, చరణ్, పవన్, రామకృష్ణ, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com