
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాతలకు సన్మానం చేసిన గుడివాడ పట్టణ జనసైనికులు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాతల దినోత్సవం సందర్భంగా DBSL టీమ్ మరియు జనసైనికులు రక్త దానం చేసిన పలువురు రక్త దాతలను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (Rk) మాట్లాడుతూ రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అని చిరంజీవి గారి చెప్పిన మాటలు స్ఫూర్తితో గుడివాడ పట్టణంలో ఎంతోమందికి రక్తదానం చేసిన వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రపంచ రక్తదాతల దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే మన గుడివాడ పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా DBSl ట్రస్ట్ వారు ఎంతోమందికి రక్తదానం చేసి ప్రాణాల్ని కాపాడి మానవత్వం చాటుకున్నారు. వారికి మా జనసేన తరపున వారిని సన్మానించడం మాకు చాలా ఆనందంగా ఉంది. యువత అంటే చాలామంది సినిమాలకి షికార్లకి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ మన గుడివాడ పట్టణంలో యువత మానవత్వంతో సహాయ కార్యక్రమాలు చేస్తూ ముందుగా ఉంటున్నారు. వారందరికీ నా నమస్కారములు ఇలాగే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలను చేసుకుంటూ గుడివాడ పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో DBSL ట్రస్ట్ సభ్యులు కాజా భాయ్, సందీప్ భారతీయుడు, డాన్స్ మాస్టర్ ఆర్య, జాషువా, అయ్యప్ప, మరియు జనసైనికులు పాల్గొన్నారు.