Logo
Date of Publish : 14 August 2021, 4:10 pm
Editor : Sake Naresh

అనాధ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటిన గుడివాడ జనసైనికులు

      గుడివాడ, (జనస్వరం) :   కృష్ణాజిల్లా, గుడివాడ పట్టణ పేదఎరుకపాడు గ్రామంలో ఎవరూ లేని అవ్వ చనిపోవడంతో జనసైనికులకు తెలియజేయగా వెంటనే స్పందించి ఆ మృతదేహానికి జనసైనికులు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (Rk) గారు మాట్లాడుతూ పేదఎరుకపాడు గ్రామంలో గత కొన్ని ఏళ్లుగా అనేక ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవిస్తున్న దాసిన సత్యమ్మ  గారు కరోనా మహమ్మారి వల్ల పనులు లేక తినటానికి తిండి లేక అనారోగ్యంతో మరణించడంజరిగింది. జనసైనికులు ద్వారా ఈ సమాచారం తెలుసుకుని ఆ అమ్మకి అంతక్రియలు చేయడం జరిగిందని తెలియజేసినారు. ఇటువంటి నిరాశ్రయులకు రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాలు ఏర్పాటు చేసి అనాధలను ఆదుకోవాలని తెలియజేసినారు. అలాగే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మానవతా హృదయంతో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరారు. మా నాయకుడు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో గుడివాడ పట్టణంలో అనేక సేవా కార్యక్రమం చేసుకుంటూ ప్రజలకు దగ్గరగా ఉండి వారి సమస్యలు తీరుస్తున్నామని,  ప్రజల పక్షాన నిలబడే పార్టీ కేవలం జనసేన పార్టీ మాత్రమే అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నాకు సహకరించిన జన సైనికులకు నా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అయ్యప్ప, చరణ్, జగదీష్, మహమ్మద్ హుస్సేన్, సంఘ సంస్కర్త రామిశెట్టి మురళి గారు తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com