గుడివాడ, (జనస్వరం) : కృష్ణాజిల్లా, గుడివాడ నియోజకవర్గం, గుడ్లవల్లేరు మండలం, కౌతవరం గ్రామంలో రోడ్డు ప్రమాదంలో వెన్నుముకకు దెబ్బ తగిలి రెండు కాళ్లు చచ్చుబడిపోయేనా రోజు వారి కూలీగా జీవనం సాగిస్తున్న పేద కుటుంబానికి చెందిన బంటు రామకృష్ణ, భవాని గారికి జనసేన పార్టీ నాయకులు 11 వేల రూపాయలు మరియు రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ నియోజకవర్గ, జనసేన పార్టీ నాయకులు సందు. పవన్ మాట్లాడుతూ చిన్న వయసులోనే రామకృష్ణకు ఇంత పెద్ద కష్టం రావటం చాలా బాధాకరమని, డాక్టర్ల సలహా మేరకు బాధితుడికి మెరుగైన వైద్యం అందించడంలో తన వంతు పూర్తి సహకారం అందిస్తానని, భవిష్యత్తులో ఆ కుటుంబానికి ఎల్లవేళలా స్థానిక జనసేన పార్టీ నాయకులు తోడుగా ఉంటారని భరోసా కల్పించారు. ఇలాంటి మహత్తర కార్యక్రమంలో తనను కూడా భాగస్వామ్యం కల్పించినందుకు స్థానిక నాయకులను అభినందించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు తూము.వెంకటరత్నం, పేర్ని.జగన్ (జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి) తోట చిన్నారి (గుడ్లవల్లేరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు) కుప్పినేని.శేషవేణి (వేణుతురు మిల్లి జనసేన పార్టీ గ్రామ సర్పంచ్) ఈ కార్యక్రమంలో జనసైనికులు ఆకుల మోహన్, షేక్ రబ్బానీ, గులివింద శ్రీను, అడపా.బాబి, కొండిశెట్టి.బాబి, ధూళిపూడి శ్రీకాంత్, సాయిన. నాగరాజు, బొల్లా.కింగ్, మరియు స్థానిక నాయకులు జనసేనపార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.