కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ స్థానిక 7వ వార్డు పుల్లలపాడు వంతెన 2వ లైన్ లో గత నాలుగు నెలలుగా మురుగు నీటి సమస్య వలన తీవ్ర ఇబ్బంది పడుతున్న ప్రజలు.. రోజు వచ్చే మంచి నీరు కూడా ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో డ్రైనేజీ పైప్ లైన్ పగలడంతో కలుషితమై ఇళ్లల్లోకి వాడుకోవడానికి కూడా లేని స్థితిలో తాగడానికి వీలు లేకుండా దుర్గంధంతో కూడిన నీళ్ళు తాగుతూ రోగాల బారిన పడుతున్నారు. ఈ విషయమై దానికి అక్కడ ప్రజలు తమ బాధను పరిస్థితిని అధికారులకు వెల్లడించగా పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. సదరు ఈ సమస్య విషయమై గుడివాడ జన సైనికులకు తెలిసి బాధితులకు అండగా స్థానికులను వెంట తీసుకొని ఎన్టీఆర్ కాలనీలో ఉన్న గ్రామ సచివాలయానికి కాలినడకన వెళ్లి వినతి పత్రం అందజేసీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరడం జరిగింది. సదరు ఈ విషయమై స్థానిక జనసేన నాయకులు లక్ష్మీకాంత్ వడ్డాది, మాచర్ల రామకృష్ణ (ఆర్ కె) మాట్లాడుతూ తక్షణమే అధికారులు దీనిపై చర్య తీసుకొని స్ధానిక వెంటనే ప్రజా సమస్యలను పరిష్కరించాలని అక్కడ రోగాల బారిన పడకుండా, దుర్వాసన రాకుండా బీజింగ్ పౌడర్ చల్లాలని, పూడుకుపోయిన డ్రైనేజీ పైపులైను నీ తక్షణమే కల్వర్టు నిర్మించి ఇటువంటి సమస్యలు మళ్లీ పునరావృతం కాకూడదని కోరుకుంటూ పరిష్కరించని పక్షంలో ప్రజలకు అండగా ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ ముందు ఉంటుందని తెలిపారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com