Logo
Date of Publish : 25 April 2021, 1:25 am
Editor : Sake Naresh

శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని గుడివాడ జనసేన నాయకులు, వీరమహిళల పూజలు

                    జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోవిడ్ బారినపడి క్వారంటైన్ లో చికిత్స పొందుతున్న ఆయనకు కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ జనసైనికులు మాచర్ల రామకృష్ణ (ఆర్కె) గారి ఆధ్వర్యంలో స్థానిక ఆంజనేయ స్వామి దేవస్థానంలో కులమతాలకతీతంగా క్రిస్టియన్ ముస్లిం సోదరులు సోదరీమణులతో మోకాలిపై నడుచుకుంటూ స్వామివారికి కోట్లాది మంది అభిమాన నటుడు, సేవా దృక్పథం గల వాడు, అడిగిన వాళ్లకి కాదనకుండా సాయం చేసే కర్ణుడు, ప్రజా సమస్యలపై ప్రశ్నించే నాయకుడు అధినేత పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని దేవస్థానంలో ప్రత్యేకమైన పూజలు చేయించడం జరిగింది.. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోవేట్ బారినపడి చికిత్స పొందుతున్న ఆయనకు గుడివాడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు చేయడం జరిగిందని ఆయన త్వరగా కోలుకొని మన ముందుకు రావాలని సమాజం కోసం దేశం కోసం పరితపించే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తికి కోట్లాది అభిమానులు ఎదురుచూస్తున్నారని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అయ్యప్ప, వడ్డాది లక్ష్మీకాంత్, జగదీష్, పవన్, రామకృష్ణ, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ కరీం, జనసేన వీర మహిళ అరుణ, అనూష, కళ్యాణి గారు, మరియు జనసైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com