సత్తెనపల్లి ( జనస్వరం ) : నకరికల్లు గ్రామం మెయిన్ రోడ్డు వద్దనున్న హుస్సేన్ హాస్పిటల్ నుండి పాతూరు మసీదు వరకు రోడ్డు వేస్తానని చేసిన ఎన్నికల హామీలో భాగంగా మరియు "గడప గడపకి మన ప్రభుత్వం" కార్యక్రమంలో ఇచ్చిన వాగ్ధానంలో భాగంగా స్థానిక MLA మరియు రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు ఇచ్చారు. మాట తప్పినందుకు, మడెమ తిప్పినందుకు నిరసన తెలియజేస్తూ జనసేన వీరమహిళ నిరాహార దీక్ష చేస్తోంది. గత 2 రోజులుగా కనీసం మంచినీరు కూడా తాగకుండా కఠినంగా దీక్ష చేస్తోంది. సదరు రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెట్టేవరకు లేదా ఆ మేరకు ప్రభుత్వం హామీ ఇచ్చేవరకు లక్ష్మీ ఆమరణ దీక్ష విరమించే ప్రసక్తే లేదని చెప్తోంది. గంట గంటకి ఆమె ఆరోగ్యం క్షీనిస్తోంది. ఇప్పటికే గురజాల, వినుకొండ జనసేన నాయకులు పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఈ పోరాటంలో లక్ష్మీకి జిల్లా వ్యాప్తంగా మద్దతు పెరుగుతూ ఉంది. రేపు రాష్ట్ర స్థాయి నేతలు రానున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో లక్ష్మీకి ఏమైనా జరిగితే అంబటి రాంబాబు పూర్తి భాద్యత వహించవలసి ఉంటుందని జనసేన నాయకులు హెచ్చరించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com